మా దాహం తీర్చండి.. మహాప్రభో
మా దాహం తీర్చండి మహాప్రభో…
డోన్ టౌన్, ఏప్రిల్ 28, (సీమకిరణం న్యూస్) :
స్థానిక కోట్ల సుజాతమ్మ నగర్లో కాలనీవాసులు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారని కాలనీలో త్రాగు నీటి సరఫరా నాలుగు రోజులు కు ఒకసారి జరుగుతుందని కాలనీ వాసులు భాగ్యమ్మ ,వడ్డే లక్ష్మీదేవి తెలిపారు. సుజాతమ్మ నగర్లో ప్రజలు తీవ్ర నీటి సమస్యను ఎదుర్కొంటున్నారని నాలుగు రోజులకు ఒక సారి వదులుతూ ఉండడంతో కాలనీలోని ప్రజలు నీటి సమస్యలను ఎదుర్కోవడమే కాకుండా రాత్రి సమయాల్లో వీధి లైట్లు వెలగక పోవడంతో వృద్ధులు చిన్నపిల్లలు పాముల బెడద తో హడలి పోతున్నారని, కాలనీ చుట్టుప్రక్కల మురుగునీటి కాలువలు ప్రవహిస్తుండడంతో ఇక్కడ త్రాగునీరు కలుషితం కావడం వల్ల పలు ఆరోగ్య సమస్యలను కూడా ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కలుషిత నీటితో శరీర సంబంధమైన వ్యాధులు కూడా వ్యాపిస్తున్నాయని ఎన్నిసార్లు అధికారులకు విన్నపాలు తెలిపిన పట్టించుకోవడంలేదని వారు తెలిపారు. కాలనీలో నివసిస్తున్న కొంతమంది త్రాగునీటి కుళాయిలను ఏర్పాటు చేసుకున్న ఫలితం లేకుండా పోయిందని ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కోట్ల సుజాత నగర్ నందు విద్యుత్ దీపాలు త్రాగునీటి సమస్య రోడ్లు, మురికి నీటి పారుదల సౌకర్యాలను కల్పించాలని కాలనీవాసులు కోరుతున్నారు.