గడప గడపకు కార్యక్రమం ఘనవిజయం చేద్దాం
గడప గడపకు కార్యక్రమం ఘన విజయం చేద్దాం
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్ గోపాల్ రెడ్డి
ఆదోని ప్రతినిధి, మే 01,( సీమకిరణం న్యూస్):
ఆదోని లో గడప గడపకు కార్యక్రమం ఘనవిజయం చేద్దామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్ గోపాల్ రెడ్డి .తెలిపారు. అలాగే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం నుండి నియోజకవర్గంలో గడప, గడపకు, వైయస్సార్ కార్యక్రమం నిర్వహించుటకు నిర్ణయించడమైనది . ఈ కార్యక్రమంలో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ మూడేళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రతిపక్ష పార్టీ విష ప్రచారాలను గురించి ప్రజలకు తెలియజేయడం జరుగుతుంది. ఆదోని మండలం లో విరుపాపురం గ్రామంలో కార్యక్రమము నిర్వహించబడును.
కావున ఆదోని మండలం లోని ఎంపీటీసీలు, సర్పంచులు,పట్టణంలోని కౌన్సిలర్లు, నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు, నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు.