పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన ఆదోని ఎమ్మెల్యే
ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ
ఆదోని ప్రతినిధి, మే 01, ( సీమకిరణం న్యూస్):
ఆదోని పట్టణంలో పాత పోస్ట్ ఆఫీస్ దగ్గర హవేలీ ఫంక్షన్ హాల్ లోనూర్ భాషా రంజాన్ సందర్భంగా180 మంది పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి పాల్గొని ఎమ్మెల్యే చేతుల మీదుగా పేద ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది అనంతరం ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ రంజాన్ పవిత్ర మాసం లో పేద ప్రజలకు నిత్యావసర సరుకులు అందించడం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు ముస్లిం సోదరులకు ఎల్లప్పుడూ వెన్నంటే ఉండి వాళ్లకు సహాయం అందించడంలో మా వంతు ఎల్లప్పుడూ సాయం చేస్తామని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి అన్నారు. అల్తాఫ్ హుసేన్ సబ్ మాట్లాడుతూ ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ నిరంతరం ముస్లింల అభివృద్ధికి పాటుపడుతున్న ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలుపుతూ ఎల్లప్పుడూ ముస్లిం సోదరులు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి
వెంట ఉంటారని చెప్పారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు బి దేవా బషీర్ ఇదే ఇదియాత్ భాష తదితరులు పాల్గొన్నారు