ప్రశాంతంగా పదవ తరగతి పరీక్షలు
కర్నూలు జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు
కర్నూలు కలెక్టరేట్, మే 02, (సీమకిరణం న్యూస్) :
జిల్లాలో ప్రశాంతంగా పదవ తరగతి పరీక్షలు జరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వరరావు పేర్కొన్నారు. సోమవారం ఓర్వకల్లు మండలం కేంద్రం లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల మరియు ఎ.పి మోడల్ హై స్కూల్ లో పదవ తరగతి పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పరీక్ష కేంద్రంలో మౌలిక వసతులతో పాటు వేసవి దృష్ట్యా తాగునీరు, విద్యుత్ తదితర ఏర్పాట్లపై కలెక్టర్ అధికారులతో ఆరా తీశారు. పరీక్షల నిర్వహణ లో ఎలాంటి అలసత్వం ప్రదర్శించరాదని అధికారులను హెచ్చరించారు. సెల్ ఫోన్లు పరీక్ష కేంద్రంలోకి అనుమతించకూడదని సిబ్బందికి జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా కట్టుదిట్టంగా పరీక్షలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.