పార్టీ యువనేతను కోల్పోవడం బాధాకరం
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
పార్టీ యువనేతను కోల్పోవడం బాధాకరం
-: రాష్ట్రంలో మహిళలకు రక్షణ ఏదీ
దిశ చట్టo చర్యలు లేవు
-:టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
కర్నూలు కలెక్టరేట్, మే 02, (సీమకిరణం న్యూస్) :
జిల్లాలో టీడీపీ ఎంతో భవిష్యత్తు ఉన్న యువనేతను కోల్పోవడం బాధాకరమని
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. సోమవారం ఆయన ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువనేత రాజ వర్ధనరెడ్డి కుటుంబంను పరామర్శించేoదుకు కర్నూలు వచ్చారు. ఈ సందర్భంగా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ రాజవర్ధన్ మొదట నాకు స్నేహితుడని తరువాత రాజకీయ నాయకుడన్నారు. తాను మంత్రిగా ఉన్న సమయంలో ఎంపీపీగా ఉన్న రాజవర్ధన్ అనేక సమస్యల పరిష్కరించాలని వచ్చే వారని గుర్తు చేశారు. ఐటీ నిపుణులుగా, సాఫ్ట్ వేర్ రంగం నుంచి రాజకీయల్లోకి వచ్చి ప్రజల్లో చెరగని ముద్ర వేసు కున్నారన్నారు. ఓ చెరువు విషయంలో న్యాయ పోరాటం చేశారన్నారు. ఆయన చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ఆ కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని,దిశ చట్టం చర్యలు లేవన్నారు. 800 మంది మహిళలపై అఘాయిత్యాలు జరిగితే చర్యలు లేవ న్నారు. సిఎం జగన్ బాధితుల కుటుంబంను కూడా పరా మర్శించలేదన్నారు. అంతకు ముందు ఓర్వకల్ విమానాశ్రo లో పార్టీ శ్రేణులు, మహిళలు భారీ గజ మాలలతో ఘన స్వాగత పలకడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.సమావేశంలో టీడీపీ కర్నూలు, నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులు సోమి శెట్టి వెంకటేశ్వర్లు, గౌరు వెంకట రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సుజాతమ్మ , గౌరు చరిత , నాయకులు టిజి భరత్, టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.