విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం
కర్నూలు జిల్లా ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి

విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం…
కర్నూలు జిల్లా ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి ఐపియస్
కర్నూలు క్రైమ్, మే 02, (సీమ కిరణం న్యూస్) :
కర్నూలు నగరంలోని కొత్తపేట దగ్గర ఉన్న స్పందన కార్యాలయంలో జిల్లా ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి ఐపియస్ సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు.
స్పందన కార్యక్రమానికి ఈ రోజు మొత్తం ఇప్పటివరకు 65 ఫిర్యాదులు వచ్చాయి.
స్పందనకు వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాది దారులతో మాట్లాడారు. వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని ….
1) కుమారులు ఆస్తి తీసుకొని అన్నం పెట్టడం లేదని కర్నూలు మండలం, ఈ. తాండ్రపాడు గ్రామానికి చెందిన శేషమ్మ ఫిర్యాదు చేశారు.
2) HCL కంపెని నుండి ఫోన్ చేస్తున్నామని చెప్పి మా కుమార్తె కు ఆన్ లైన్ లో సాఫ్ట్ వేర్ డెవలపర్ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి రూ. 34 వేలు తీసుకుని మోసం చేశారని కర్నూలు , జోహరాపురం గ్రామానికి చెందిన దొరస్వామి ఫిర్యాదు చేశారు.
3) ప్రేమించి , పెళ్ళి చేసుకుని నన్ను మోసం చేసిన వ్యక్తి పై చర్యలు తీసుకోవాలని ఆదోని కి చెందిన ఒక మహిళ ఫిర్యాదు చేశారు.
4) ఆన్ లైన్ లో మొబైల్ కోనుగోలు చేసినందుకు ఆన్ లైన్ షాపింగ్ వారు మొబైల్ కోనుగోలు చేసినందుకు గాను కారు బహుమతిగా వచ్చిందని చెప్పి నమ్మించి 1 లక్ష 43 వేలు కట్టించుకుని మోసం చేశారని కోడుమూరు కు చెందిన నగేష్ ఫిర్యాదు చేశారు.
స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా జిల్లా ఎస్పీ హామీ ఇచ్చారు. ఈ స్పందన కార్యక్రమంలో డిఎస్పీలు యుగంధర్ బాబు, వెంకటాద్రి ఉన్నారు.