అగ్ని ప్రమాదంలో దుకాణం దగ్ధం
అగ్ని ప్రమాదంలో దుకాణం దగ్ధం…
-: రూ.1.50 లక్షల ఆస్థినష్టం
పెద్దకడబూరు, మే 04, (సీమకిరణం న్యూస్) :
మండల పరిధిలోని మేకడోన గ్రామంలో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో రూ.1.50 లక్షల ఆస్థినష్టం వాటిల్లింది.ముల్లా భాషా కు చెందిన కిరాణ దుకాణానికి ప్రమాదవశాత్తు నిప్పంటుకొని దగ్ధం అయింది. దీంతో ఆస్థి నష్టం సంభవించింది. భాషా తన ఇంటి వద్ద కిరాణా షాపు, పెట్రోల్ అమ్ము కొంటూ జీవనం సాగిస్తున్నారు. ఉదయం భాషా భార్య ఇంట్లో వంట చేస్తుండగా, పెట్రోల్ కోసం వాహన దారుడు వచ్చాడు. ఆమె బైక్ కు పెట్రోల్ పోస్తుండగా కొంత కిందపడి పోవడంతో ప్రమాదవశాత్తు నిప్పంటుకొంది. చుట్టుపక్కల వారు అప్రమత్తమైయ్యేలోగా మంటలు పెద్దవై దుకాణంలో సరుకులు పూర్తిగా కాలిపోయాయి. అలాగే ఇంట్లో ఉన్న బైక్ కూడా దగ్ధం అయింది. సంబంధిత అధికారులు స్పందించి బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.