ANDHRABREAKING NEWSPOLITICSSTATE
బాధ్యతాయుతంగా వ్యవహరించాలి
బాధ్యతాయుతంగా వ్యవహరించాలి
కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ ఏ.భార్గవ్ తేజ
కర్నూలు మున్సిపల్, మే 04, (సీమకిరణం న్యూస్) :
సచివాలయ సిబ్బంది బాధ్యతా యుతంగా వ్యవహరించాలని కర్నూలు నగర పాలక సంస్థ కమిషనర్ ఏ.భార్గవ్ తేజ అన్నారు. బుధవారం నగరంలోని 94, 97, 129 సచివాలయాను ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, విధుల పట్ల అలసత్వం వహించవద్దని సిబ్బందికి సూచించారు. సాధ్యమైనంత వరకు ప్రజలను తిప్పుకోకుండా వీలైనంత త్వరగా పనులు చేయాలని ఆదేశించారు.