పదవ తరగతి , ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు
కర్నూలు కలెక్టరేట్, మే 06, (సీమకిరణం న్యూస్) :
కర్నూలు నగరంలో పదవ తరగతి , ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు పరిశీలించారు. శుక్రవారం నగరంలోని సెయింట్ మేరీ ఇంగ్లీష్ మరియు తెలుగు మీడియం స్కూల్ లో నిర్వహిస్తున్న పదవ తరగతి పరీక్షా కేంద్రాన్ని, వాసవి జూనియర్ కాలేజ్ లో ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. పొరపాట్లకు తావివ్వకుండా పదవ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహించాలని ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పరీక్షల నిర్వహణ లో ఏ ఒక్క అవాంఛనీయ సంఘటన జరగకూడదని,విధి నిర్వహణ లో అప్రమత్తంగా ఉండాలని, అక్రమాలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ హెచ్చరించారు.