ANDHRABREAKING NEWSCRIMESTATE

సిద్దేశ్వర జలదీక్షను విజయవంతం చేయండి

*ఛలో సిద్దేశ్వరం..*

*రాయలసీమ సాగునీటి సాధన సమితి*
~~~~~~~~~~~~~~~~~~~~~~~

మే 31 న జరిగే సిద్దేశ్వర జలదీక్షను విజయవంతం చేయండి

( దొర్నిపాడు మండలం అమ్మిరెడ్డినగర్, చాకరజాముల నుండి )

శ్రీశైలం డ్యాంలో 60 tmc ల నీరు నిల్వ వుండేటట్లుగా చూడాలన్న బచావత్ ట్రిబ్యునల్ ఆదేశాలను కూడా రెండు తెలుగు రాష్ట్రాలు శ్రీశైలం డ్యాం అడుగు వరుకు నీటిని తోడేసి రాయలసీమకు బురదను మిగుల్చుతున్నారని రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి ఆరోపించారు. మే 31 న జరిగే *సిద్దేశ్వర జలదీక్ష* కార్యాక్రమంలో భాగంగా శుక్రవారం నాడు దొర్నిపాడు మండలం అమ్మిరెడ్డినగర్, చాకరాజువేముల గ్రామాలలో సన్నాహక సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా బొజ్జా దశరథరామిరెడ్డి మాట్లాడుతూ…రాయలసీమ ప్రాంతం పట్ల రాజకీయ పార్టీలు నిర్లక్ష్యం వహిస్తున్నారనీ, రాయలసీమ సమాజం మేల్కొనకపోతే భవిష్యత్తు తరానికి త్రాగడానికి కూడా నీరు లభించదని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. రాయలసీమ ప్రాంతంలో 23 లక్షల ఎకరాలకు నీరు పారాల్సి వుండగా ,పాలకుల నిర్లక్ష్యం తో కేవలం 8 లక్షల ఎకరాలకు మాత్రమే నీరు లభిస్తోందని ఆయన అన్నారు. రాయలసీమ వినియోగించకొనలేని ఈ నీరంతా దిగువన ఉన్న కృష్ణా డెల్టాకు చేరుతున్నదని అన్నారు. దీనితో కృష్ణా డెల్టా ప్రాంతానికి రబీ కాలంలో 37498 ఎకరాలకు నీరు పారాల్సి వుండగా 10 లక్షల ఎకారాలకు సాగునీరు,3లక్షల ఎకరాల చేపల చెరువులకు వెరసి 13 లక్షల ఎకారాలకు నీరు పారించుకుంటున్నారని అన్నారు. రాయలసీమ ప్రాంతానికి ఇంత అన్యాయం జరుగుతున్నా మన నాయకులు నోరు మెదపడం లేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఎంతసేపూ పోలవరం , అమరావతి మీదనే కేంద్రీకృతమైనారు తప్ప కరువుతో అలమటిస్తున్న రాయలసీమ ప్రజానీకం పై సవతి ప్రేమను చూపెడుతున్నారని ఆయన విమర్శించారు. ఈ నేపథ్యంలోనే రాయలసీమ ప్రాంత సాగు, త్రాగునీటి కోసం మనమందరం 2016, మే 31 న సిద్దేశ్వరం అలుగు వద్ద ఎర్రటి ఎండలను, ప్రభుత్వ నిర్భందాలను లెక్కచేయకుండా సిద్దేశ్వర అలుగు ప్రజా శంఖుస్థాపన చేసామని దశరథరామిరెడ్డి గుర్తు చేసారు. 2016 సంవత్సరంలో వేలాదిమంది రైతులతో మనమంతా ఎక్కడైతే అలుగు ప్రజా శంఖుస్థాపన చేసామో ఇప్పడు కల్వకుర్తి – నంద్యాల జాతీయ రహదారిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సిద్దేశ్వరం దగ్గర వంతెన నిర్మాణం చేపడుతోందని, వంతెనతో పాటు అలుగు కూడా నిర్మించి రాయలసీమ ప్రజల నీటి కష్టాలను తీర్చాలని దశరథరామిరెడ్డి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేసారు. ఇదొక మంచి అవకాశమని రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని కేంద్రప్రభుత్వం మీద ఒత్తిడి చేసి అలుగు నిర్మాణం చేయాలని ఆయన విజ్ఞప్తి చేసారు. ఈ సందర్భంలోనే సిద్దేశ్వర అలుగు ప్రజా శంఖుస్థాపన ఆరవ వార్షికోత్సవం సందర్భంగా మే 31 న సిద్దేశ్వరం అలుగు దగ్గర జరగబోయే జలదీక్షకు ప్రజలంతా వేలాదిగా, వందాలది ట్రాక్టర్లలో తరలివచ్చి జలదీక్ష విజయవంతం చేయాలని దశరథరామిరెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశాలలో రాయలసీమ సాగునీటి సాధన సమితి ఉపాధ్యక్షులు వై.యన్.రెడ్డి, చెరుకూరి వెంకటేశ్వరనాయుడు, అమ్మిరెడ్డినగర్ రైతు నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, చెరుకూరి శ్రీనివాసులు, దశరథరామిరెడ్డి, నరసారెడ్డి, చాకరజాముల గ్రామ రైతు నాయకులు మల్లేష్ చౌదరి, జగదీశ్వరనాయుడు, సురేష్, బాలరాజు, రామసుబ్బనాయుడు మరియు ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS... RNI REGISTRATION NUMBER... RNI : APTEL/2018/76380.... S.K. NAZEER. FOUNDER , EDITOR & PUBLISHER. SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD. SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA | Telugu News | Latest News Online | Political News in Telugu | Andhra Pradesh Latest News | AP Political News | Telangana News | Telangana Politics News | Crime News | Sports News |

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS... RNI REGISTRATION NUMBER... RNI : APTEL/2018/76380.... S.K. NAZEER. FOUNDER , EDITOR & PUBLISHER. SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD. SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA | Telugu News | Latest News Online | Political News in Telugu | Andhra Pradesh Latest News | AP Political News | Telangana News | Telangana Politics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!