ఆనందోత్సవాల నడుమ ఆత్మీయ సమావేశం

ఆనందోత్సవాల నడుమ ఆత్మీయ సమావేశం
భారీ సంఖ్యలో పాల్గొన్న మండల వైసీపీ నాయకులు, కార్యకర్తలు
నెల్లూరు, మర్రిపాడు, మే 07, (సీమకిరణం న్యూస్):
క్రీ.శే మేకపాటి గౌతమ్ రెడ్డి అకాల మరణం అనంతరం ఆత్మకూరు నియోజకవర్గ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయనున్న మేకపాటి విక్రమ్ రెడ్డి, మాజీ ఎం పి మేకపాటి రాజమోహన్ రెడ్డి శనివారం మర్రిపాడు మండల కేంద్రంలో వైసిపి నాయకులు మరియు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది.ముందుగా మండల కేంద్రంలోని అభయాంజనేయ స్వామి ని దర్శించుకొనితదుపరి సభా ప్రాంగణం వరకు నడుచుకుంటూ ప్రతీ ఒక్కరిని ఆప్యాయంగా పలకరించుకుంటూ వెళ్లారు.సభా ప్రాంగనానికి చేరుకున్న పిమ్మట మేకపాటి వారి స్వాగ్రామమైన బ్రాహ్మహనపల్లి గ్రామస్తులు గజ మాలతో సత్కరించారు.ఈ సందర్భంగా మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి సహకారంతో నాన్న రాజమోహన్ రెడ్డి, నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో అన్న దివంగత నేత క్రీ.శే. మేకపాటి గౌతంరెడ్డి ఆశయాలకు అనుగుణంగా, ప్రజా సంక్షేమమే ద్యేయంగా ప్రజలకు సేవచేయడానికి అన్న గౌతమ్ స్థానంలో మీ ముందుకు వచ్చాను అంటూ వైసిపి నాయకులను, కార్యకర్తలను ఆత్మీయంగా పలకరించుకుంటూ ఆనందోత్సవాల మధ్య మేకపాటి విక్రమ్ రెడ్డి తో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా పెద్దాయన రాజమోహన్ రెడ్డి మాట్లాడుతూ నా మొదటి బిడ్డను మీ నాయకుడిగా ఎంతగానో ఆదరించారని కానీ విధి ఆడిన నాటకంలో ఒక పాత్రలాగా మొదటి బిడ్డ గౌతమ్ రెడ్డి అకాల మరణం మనలందరిని కలిచివేసింది అని తదుపరి మేకపాటి రాజకీయ వారసుడిగా మీ ముందుకు నా రెండవ కుమారుడువిక్రమ్ రెడ్డిని మీ ముందుకు తీసుకోని వచ్చాను అని అంటూ విక్రమ్ రెడ్డి మీ నాయకుడు కాదు ప్రజా సేవకుడు అని కితాభిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో అప్షన్ సభ్యుడు గాజుల తాజద్దీన్,జడ్పీటీసీ మల్లు సుధాకర్ రెడ్డి, ఎంపీపీ గంగవరపు లక్ష్మి శ్రీనివాసులు నాయుడు, కన్వీనర్ బొర్రా వెంకటసుబ్బారెడ్డి, మాజీ మండల కన్వీనర్ గంగవరపు శ్రీనివాసులునాయుడు,బీమవరం సొసైటీ ప్రెసిడెంట్ యర్రమల్ల చిన్నారెడ్డి,బుధవాడ సొసైటీ చైర్మన్ నారపరెడ్డి సుబ్బారెడ్డి,మండల వైసీపీ నాయకులు పుట్టం శ్రీనివాసులు రెడ్డి,సిద్ధం రెడ్డి రమా మోహన్ రెడ్డి,దుద్దుగుంట రవికుమార్ రెడ్డి, కన్నపురెడ్డి అమర్నాథ్ రెడ్డి,రైతుసంఘం మండల అధ్యక్షుడు బారెడ్డి వెంకటసుబ్బారెడ్డి,దుద్దుగుంట జయరామిరెడ్డి,గుర్రం నాగేశ్వరావు,సోమల మాధవరెడ్డి, శ్రీధర్ నాయుడు, సర్పంచ్ ఎస్కె బిబిజాన్,మన్నే బాలకొండారెడ్డి, కడప ఓబుల్ రెడ్డి, లాయర్ రాంగోపాల్ రెడ్డి,గిన్నె వెంకటేశ్వర్లు, సర్పంచ్ జయమ్మ,సి హెచ్ నారాయణ స్వామి, ఎస్కెమౌలాలి ,ఎంపిటీసీలు, సర్పంచ్ లు మరియు మేకపాటి అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.