ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కార్యవర్గ సమావేశం

ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులుగా కొత్త వెంకటేశ్వరరావు , ఉపాధ్యక్షులుగా పసుమర్తి రామ్మోహన్ రావు నియామకం.
ఖమ్మం : తెలంగాణ రాష్ట్ర ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కార్యవర్గ సమావేశం హైదరాబాదులో ముషీరాబాద్ వాసవి ఆర్య వైశ్య హాస్టల్లో ఆదివారం జరిగిందని . దీంట్లో భాగంగా ఖమ్మం ప్రాంతానికి చెందిన ప్రముఖ న్యాయవాది కొత్త వెంకటేశ్వరరావు ను ఇంటర్నేషనల వైశ్య ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులుగా మరియు గాంధీ చౌక్ ప్రాంతానికి చెందిన 36వ డివిజన్ కార్పొరేటర్ పసుమర్తి రామ్మోహన్ రావు ను ఇంటర్నేషనల వైశ్య ఫెడరేషన్ జిల్లా ఉపాధ్యక్షులుగా నియమిస్తూ నియామక పత్రాలను తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ మరియు రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్తా , రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు గంజి రాజమౌళి గుప్తా , మహిళా అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి , ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ రావు లు అందజేశారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారి పై నమ్మకం ఉంచి ఈ బాధ్యత అప్పజెప్పినా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు . ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య ప్రముఖులు హరిబాబు , తిరుమల బుక్ స్టాల్ అధినేత ఆత్మకూరు వెంకట రామారావు , గుంటుపల్లి దివాకర్ గుప్తా , ఆకుల సతీష్ , బచ్చు మురళీకృష్ణ , రుగరుణ రవి తదితరులు పాల్గొన్నారు . ఈ సందర్భంగా వారి ఇరువుని వేములపల్లి వెంకటేశ్వరరావు , వి వి అప్పారావు , పులిపాటి ప్రసాద్ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు .