అన్ని రంగాల్లో రాణించేది అమ్మ ఒక్కటే
ఘనంగా వృద్ధ మహిళలల్ని సన్మానించిన గోరంట్ల శకుంతల
కర్నూలు టౌన్, మే 08, (సీమకిరణం న్యూస్):
అన్ని రంగాల్లో రాణించేది ఒక అమ్మ మాత్రమేనని సృష్టికి ప్రతి రూపం “అమ్మ” అని, ఆమె లేకపోతే సృష్టి లేదు.. గమనమే లేదని రాయలసీమ మహిళా సంఘ్ వ్యవస్థాపక అధ్యక్షురాలు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం మహిళా విభాగ రాష్ట్ర కార్యదర్శి గోరంట్ల శకుంతల అన్నారు. మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం నగరంలోని అశోక్ నగర్ పట్టణ నిరాశ్రయ మహిళా వసతిగృహంలో తల్లి సమానులైన నిరాశ్రయ వృద్ధ మహిళల్ని గోరంట్ల శకుంతల దుశ్శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా గోరంట్ల శకుంతలను మహిళలు సన్మానించారు. అనంతరం శకుంతల మాట్లాడుతూ ఎంతచేసినా, ఏమిచ్చినా అమ్మ ఋణం తీర్చుకోలేనిదన్నారు. మాతృమూర్తి లేకుంటే సృష్టి లేదని, సృష్టికి ప్రతిరూపం అమ్మ.. అమ్మ లేకపోతే జననంలేదు,గమనమే లేదన్నారు. అన్ని రంగాల్లో రాణిస్తూ కుటుంబం కోసం తమ వంతు బాధ్యతల్ని నిర్వర్తిస్తున్న అమ్మకు వందనం చెప్పాల్సిన సమయం రావడం సంతోషంగా ఉందన్నారు. జన్మ నివ్వకపోయినా. మీరు నాపట్ల చూపుతున్న ప్రేమభిమానాలు ఎప్పటికి గుర్తుంటాయిన్నారు. ఎక్కడో ఉన్న నిరాశ్రయ మహిళలకు, వృద్ధ మహిళలకు సంరక్షకురాలిగా ఉంటూ తమ ఆలనా పాలనా చూసుకుంటున్న శకుంతలమ్మ తమకు ఎప్పటికి అమ్మ ఆని వారు కొనియాడారు. కార్యక్రమంలో ఆశ్రమంలోని మహిళలు, వృద్ధులు, కేర్ టేకర్ లతశ్రీ పాల్గొన్నారు