
భగీరథ మహర్షి పట్టుదల స్ఫూర్తిదాయకం
ఇంఛార్జి డి ఆర్ ఓ మల్లికార్జునుడు
కర్నూలు కలెక్టరేట్, మే 08, (సీమకిరణం న్యూస్):
భగీరథ మహర్షి పట్టుదల అందరికీ స్ఫూర్తిదాయకమని ఇంఛార్జి డి ఆర్ ఓ మల్లికార్జునుడు పేర్కొన్నారు. ఆదివారం శ్రీ భగీరథ మహర్షి జయంతి సందర్భంగా బి సి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో నిర్వహించిన కార్యక్రమంలో డి ఆర్ ఓ, బిసి సంక్షేమ అధికారి వెంకట లక్షుమ్మ, ఈడిగ కార్పొరేషన్ డైరెక్టర్ జి.డి.కళ్యాణి, బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ శివ శ్యామల కుమారి, భవసార క్షత్రియ డైరెక్టర్ హెచ్.భవాని తదితరులు భగీరథ మహర్షి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డి ఆర్ ఓ మాట్లాడుతూ, భగీరథ మహర్షి ఎంతో పట్టుదల కలిగిన వ్యక్తి అని, ఎన్ని అవాంతరాలు ఎదురైనా దివి నుండి భువికి గంగను లోక కల్యాణం కోసం తెచ్చిన మహానుభావుడన్నారు.ఆయన పట్టుదలకు మారు పేరని, అందుకే ఆయన అపర భగీరథుడుగా పేరొందారన్నారు.పరోపకారానికి, దీక్షకు, సహనానికి ప్రతిరూపమైన భగీరధుని ఆదర్శంగా తీసుకొని సమాజం కొరకు సేవ చేయాలన్నారు.కఠోర పరిశ్రమ చేసి దేనినైనా సాధించగలమని భగీరథ నిరూపించారని వారిని స్ఫూర్తిగా తీసుకొని యువత లక్ష్యాలను సాధించి విజయాలు అందుకోవాలని తెలిపారు. మరుగునపడిన చరిత్రకారుల జీవితాలను, మహనీయుల గొప్పతనాన్ని వెలికితీసి వారి ఆదర్శ భావాలను స్ఫూర్తిగా తీసుకోవాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం అధికారికంగా ఇలాంటి కార్యక్రమాలను చేపడుతోందని తెలిపారు. ఈ సమావేశంలో ఉప్పర సంఘం ప్రెసిడెంట్ డి.రాముడు, కర్నూలు జిల్లా ఉప్పర సంఘం గౌరవ ప్రెసిడెంట్ జి.బాల మద్దిలేటి, సాగర భగీరథ చారిటీ ట్రస్ట్ డైరెక్టర్ డి.ఓబులేసు, కర్నూలు జిల్లా ఉప్పర యువజన ప్రెసిడెంట్ యు.గోపి, కర్నూలు జిల్లా ఉత్తర సంఘం గౌరవ ప్రెసిడెంట్ గిడ్డయ్య, జిల్లా బిసి ఫెడరేషన్ సెక్రెటరీ డి.ధనుంజయ ఆచారి, కర్నూలు జిల్లా కురువ సంఘం సెక్రటరీ ఎం.కె రంగస్వామి, విద్యార్థులు పాల్గొన్నారు.