మోటార్లకు మీటర్లు అంటే రైతులకు ఉరితాళ్లు బిగించ్చినట్లే..
కాంగ్రెస్ నేత తులసిరెడ్డి

మోటార్లకు మీటర్లు అంటే రైతులకు ఉరితాళ్లు బిగించ్చినట్లే..
కాంగ్రెస్ నేత తులసిరెడ్డి
నెల్లూరు, ఆత్మకూర్, మే 10 (సీమకిరణం న్యూస్) :
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసి రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు..నెల్లూరుకు వెళుతూ మార్గమధ్యంలో నెల్లూరు పాలెం వద్ద స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి రైతుల బాధలను తీర్చే విధంగా ఉచిత విద్యుత్తును ప్రవేశపెడితే ఆయన కుమారుడిగా ఉచిత విద్యుత్తు ఎత్తివేసే దిశగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నించడం తీవ్రంగా పరిగణిస్తున్నామని
ఉచిత విద్యుత్ అందుకుంటున్న రైతుల మోటార్లకు మీటర్లు బిగించడం అంటే రైతులకు ఉరితాడు బిగించినట్లే అని అన్నారు. ఇప్పటికే ఈ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు చేస్తూ రైతు కంట కన్నీరు పెట్టిస్తున్నరని ఇది ఏ ప్రభుత్వానికైనా శ్రేయస్కరం కాదని రైతుల కన్నీటి పర్వం లో రాష్ట్ర ప్రభుత్వం కొట్టుకుపోతుందని జోస్యం చెప్పారు. తండ్రి తెచ్చిన పథకాలకు తూట్లు పొడిచే విధంగా రైతుల మోటార్లకు మీటర్లు బిగించడం అంటే ఉచిత విద్యుత్ పథకానికి మంగళం పడినట్లేనని ఆయన అన్నారు. రాష్ట్రంలో పొత్తుల రచ్చ సరైన సమయం కాదని ఇంకా రెండేళ్లు ఎన్నికల సమయం ఉన్నందున అప్పటికీ నిర్ణయాలు ఎటువైపు మారుతాయో చెప్పలేమని ఆత్మకూరు లో జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేస్తుందని అధిష్ఠానంతో చర్చించి స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చేవూరు శ్రీధర్ రెడ్డి పేరును పరిశీలించే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ సీనియర్ నేత చేవూరు శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నేత నాగరాజు ఇతర మండలాల నేతలు హాజరయ్యారు…