గాలి, వాన భీబత్సం…
గాలి,వాన భీబత్సం…
– నేల కోరిగిన విద్యుత్ స్తంభాలు
– అన్నదాతకు అపార నష్టం
చాగలమర్రి, మే 12, (సీమకిరణం న్యూస్) :
అసాన్ తుఫాన్ ప్రభావంతో బుధవారం వేకువ నుండి ఈదురు గాలులు, మెరుపులు, ఉరుములతో గాలి,వాన మండలంలో భీభత్సం సృష్టించింది. ఈ వర్షంతో ప్రజలు అతళా కుతలం అయ్యారు. మండలంలోని పలు గ్రామాలలో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరి గాయి. మండలంలోని ముత్యా లపాడు,ఎo.తండా, కెపి.తండా
, గొట్లూరు, నేలంపాడు, కొత్తపల్లె తదితర గ్రామాల్లో సుమారు 60 కి పైగా విద్యుత్ స్తంభాలు నెలకు వాలగ, 5 ట్రాన్స్‌పారంలు విరిగి పడి విద్యుత్ శాఖకు అపార నష్టం వాటిల్లింది.33 కేవి బ్రేక్ డౌన్ కావడంతో ఆయా గ్రామాలలోని ప్రజలు అంధ కారంలో ఉండాల్సి వచ్చింది. బోర్ల కింద సాగు చేసిన సజ్జ, నువ్వు పంటలకోత సమ యంలో వర్షానికి తడిసి దెబ్బతిన్నాయి.చిన్నవంగలిలో రైతులు సాగు చేసిన బొప్పాయి, అరటి చెట్లు విరిగి పడి రైతులకు భారీనష్టం సంబవించింది. పెద్దబోధనం, చిన్న బోదనం,మద్దూరు,నేలంపాడు తదితర గ్రామాల్లో రహదారులపై ఆరబెట్టిన మొక్కజొన్న ధాన్యం తడిసి ముద్ధయ్యింది. ఇక మామిడి రైతును కుదేలు చేసింది. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి అధికారులచే పంట నష్టం అంచనా వేసి పరి హారం అందించాలని రైతులు కోరుతున్నారు.