2024లో అధికారం మాదే
-: రాయలసీమ డిక్లరేషన్ కు కట్టుబడి ఉన్నాo
-: కుటుంబ పాలన పోయి డబుల్ ఇంజన్ పాలన రావాలి
-: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సొము వీర్రాజు
కర్నూలు టౌన్, మే 12, (సీమకిరణం న్యూస్) :
ఏపీలో 2024లో మేమే అధికారంలోకి వస్తామని, రాయలసీమ డిక్లరేషన్ కు కట్టుబడి ఉన్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రా జు అన్నారు. బుధవారం మౌర్య ఇన్ హోటల్లో రాజ్యసభ సభ్యు లు టీజీ వెంకటేష్తో కలిసి ఆ యన పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.25 వేల కోట్లు ఉంటే రాష్ట్రంలోని ప్రాజెక్టులు అన్ని పూర్తి చేయ వచ్చన్నారు. రాష్ట్రంలో విద్యా, వైద్యం ప్రజలకు అందుబాటు లో లేదన్నారు. నారాయణ ను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పా లన్నారు. పేపర్ లీకేజీపై ప్రభు త్వ ఉపాధ్యాయులను అరెస్టు చేశారని, దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. వైద్యం కోసం రూ. కోట్లను ఖర్చు చేస్తు న్న మృత దేహాన్ని సొంత బండి పై తీసుకుని పోవాల్సిన దు స్థితి నెలకొందని విమర్శించారు. కర్నూలు క్యాన్సర్ హాస్పిటల్ కు రూ.100 కోట్లు ఇస్తే ఇంత వరకు ఖర్చు చేయ లేదన్నారు. హాస్పిటల్ డాట్ బోర్డుపై 100 శాతం ఖర్చు చేసినట్లుగా చూపి స్తుందన్నారు. సెంట్రల్ గవర్న మెంట్ ఇచ్చిన మందులు రాష్ట్రంలో దొరకడం లేదన్నారు. రాష్ట్రంలో హోం మంత్రి డీ ఎస్ పిని కూడా బదిలీ చేసే పరిస్థితి లేదన్నారు. సంక్షేమం జగన్ కన్నా మోడీ ఎక్కువ అభివృద్ధి పనులు చేశారన్నారు. బీజేపీ చాలా చోట్ల రెండు సీట్లతో అధి కారంలోకి వచ్చామని తెలి పారు. రాష్ట్రంలో జనసేనతో పొత్తు ఉన్నామని, త్యాగాలకు సిద్దమవుతున్న వ్యక్తి ఏపార్టీ కోసం చేస్తారో చెప్పాలన్నారు. రాయలసీమ డిక్లరేషన్ కు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. రాయలసీమపెండింగ్ ప్రాజెక్టు లపై ఉద్యమం చేపట్టడానికి సిద్ధం గా ఉన్నమన్నారు. సమా వేశంలో బీజేపీ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, హరిశ్ రావు, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.