ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSTATE

పెద్దలసభకు పెద్దాయనకి అవకాశం కల్పించాలి

పెద్దలసభకు పెద్దాయన మేకపాటి రాజమోహన్ రెడ్డి కి అవకాశం కల్పించాలి..

ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డికి నియోజకవర్గ వాసులు వినతి

నెల్లూరు, ఆత్మకూరు, మర్రిపాడు, మే 14, (సీమకిరణం న్యూస్) :

రాష్ట్రంలో రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో అందుకు సంబంధించి ఈ నెల 24వ తేదీ నోటిఫికేషన్ కూడా వెలువడ నుంది. జూన్ 10వ తేదీ ఎన్నికలను నిర్వహించనున్నారు. రాష్ట్రం నుంచి పెద్దల సభకు ప్రాతినిథ్యంవహిస్తున్న సురేష్ ప్రభు, టీజీ వెంకటేష్, సుజనా చౌదరి (వై.సత్యనారాయణ చౌదరి), వేణుంబాకం విజయసాయిరెడ్డిలకు జూన్ 21వ తేదీతో పరవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో పెద్దాయన,మాజీ ఎంపీ, మేకపాటి రాజమోహన్ రెడ్డి ని పెద్దల సభకు (రాజ్యసభకు) పంపాలని ఆత్మకురు నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకువచ్చి వైసీపీని స్థాపించినప్పుడు ఆయన వెంట నడిచిన ఏకైక రాజకీయ నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి , ఆయన అప్పటికే కాంగ్రెస్ ఎంపీగా గెలిచి ఉన్నారు. జగన్ పార్టీ పెట్టిన సందర్భంలో కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గెలిస్తే ఎవరు వెళ్లకుండా కట్టడి చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేసింది. అయితే రాజమోహన్ రెడ్డి ధైర్యంగా అటు ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానాన్ని ఇటు రాష్ట్రంలోని కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాన్ని దిక్కరించి జగన్ మోహన్ రెడ్డి తో  నేను సైతం అని ముందడుగు వేశారు. తాను కోట్లాది రూపాయలు పెట్టి చేసిన కాంట్రాక్ట్ బిల్లులువస్తాయా రావా అనే విషయాన్ని కూడా పక్కన పెట్టి జగన్ వెంట నడిచారు. జగన్మోహన్ రెడ్డి కోరిందే తడవుగా ఎంపీ పదవికి రాజీనామా చేసి నెల్లూరు ఎంపీగా వైసిపి అభ్యర్థిగా బరిలో నిలిచి మరోసారి నెల్లూరు ఎంపీగా గెలిచారు. రాజమోహన్ రెడ్డిని ఆ ఉప ఎన్నికల్లో ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అత్యంత సంపన్నుడైన మాజీ కేంద్రమంత్రి టి.సుబ్బిరామి రెడ్డిని మేకపాటి పై పోటీకి దించింది. తెలుగుదేశంపార్టీ మరో ప్రముఖ వ్యాపారవేత్త ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి నిపోటీ చేయించింది. కాంగ్రెస్, టిడిపి అభ్యర్ధుల జన ప్రవాహాన్ని తట్టుకొని మేకపాటి ఎంపీగా నెల్లూరు నుండి ఘన విజయంసాధించారు. అనంతరం 2014లో మరోసారి నెల్లూరు ఎంపీ అప్పటి టిడిపి అభ్యర్థి ఆదాల పై పోటీ చేసి మేకపాటి నెల్లూరు నుండి వరుసగా మూడు సార్లు ఎంపీగా గెలిచి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డిని లేని సమయాలలో పార్టీకి పెద్దదిక్కుగా రాష్ట్రంలో పార్టీ ప్రతిష్టకు ఎంతో కృషి చేశారు. మేకపాటి .జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని ఆయన వెంట నడిచిన సీనియర్ రాజకీయ నేతకు 2019 లో జగన్ మోహన్ రెడ్డి ఎంపీ టికెట్ ఇవ్వలేదు ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత టీడీపీ నుంచి వైసీపీ లోకి వచ్చిన ఆదాలకు నెల్లూరు ఎంపీ టికెట్ ఇచ్చినారు తనకు టిక్కెట్ ఇవ్వకపోయినా మేకపాటి ఈ రోజుకూడా ఎక్కడా తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేయలేదు. వైఎస్ఆర్ కుటుంబానికి వైసీపీకి విధేయుడు అని ప్రకటించారు. రాజమోహన్ రెడ్డి తమ్ముడు చంద్రశేఖర్ రెడ్డి కి ఉదయగిరి ఎమ్మెల్యే టికెట్ తనయుడు అప్పటి ఆత్మకూరు సిట్టింగ్ ఎమ్మెల్యే గౌతమ్ రెడ్డి కి టికెట్ ఇచ్చిన వైసిపి ఒకే ఇంట్లో మూడు టికెట్లు అని అందుకే మేకపాటి ని పక్కన పెట్టారని ప్రచారం జరిగింది. ఎన్నికల అనంతరం మేకపాటికి రాజ్యసభ సీటు ఇస్తారని రాజకీయ వర్గాలు భావించాయి. వచ్చే జూన్ నెలలో నాలుగు రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి నాలుగు సీట్లలో వైసిపి ఏ విజయం సాధిస్తుంది అయితే సీనియర్ రాజకీయవేత్తగా ఆయన మేకపాటి రాజ్యసభకు తీసుకువస్తే తన ప్రాధాన్యత తగ్గుతుందని ప్రస్తుత రాజ్యసభ విజయసాయిరెడ్డి మేకపాటికి సీటు రాకుండా చేసేందుకు బీదా మస్తాన్ రావు అనే టిడిపి నాయకుడిని వెసీపీలో చేర్పించారు. బీదకు రాజ్యసభ సీటు హామీ ఇచ్చి పార్టీ మార్చినట్లు ఒప్పందం కుదిరిందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇప్పటికే నెల్లూరుజిల్లా నుండి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. రాజమోహన్ రెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తే రెండు సీట్లు రెడ్డి సామాజిక వర్గానికి ఇచ్చారని నానుడి ఉంటుందని అందువల్ల బీసీలు అయిన బీదకు అవకాశం ఇవ్వాలని విజయసాయిరెడ్డి జగన్మోహనైడ్డిని ఒప్పించినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నంత మాత్రాన రాజమోహన్ రెడ్డికి టికెట్ ఇవ్వకూడదని ఎక్కడైనా ఉన్నదా అని నిన్న మొన్న పార్టీలో చేరిన టిడిపి నాయకుడికి రాజమోహన్ రెడ్డికి అంటి పెట్టడం ఏమిటని జిల్లాలో వైసీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. మేకపాటి తనయుడికి మంత్రి పదవి ఇచ్చి ఉన్నదని వారి తమ్ముడు ఉదయగిరి ఎమ్మెల్యే గా ఉన్నారని రాజమోహన్ రెడ్డికి పదవి ఎందుకని కొందరు చేస్తున్న వాదనలో ఎంత మాత్రం సమంజసం అని పార్టీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. రాజమోహన్ రెడ్డి 1985లోనే ఉదయగిరి నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. 1989లో ఒంగోలు ఎంపీగా గెలిచారు. 2004లో నరసరావుపేట ఎంపీ గా గెలిచారు. ఇంతటి సుదీర్ఘ రాజకీయ నేపథ్యం పాలన అనుభవం కలిగిన రాజమోహన్ రెడ్డి మర్రిపాడు మండలం ఆయన స్వగ్రామం మండలంలోని బ్రాహ్మణపల్లి మేకపాటి వెంకీ రెడ్డి ప్రధమ సంతానమైన రాజమోహరెడ్డి దేశంలోనే ప్రతిష్టాత్మకమైన వరంగల్ ఆర్ ఈ సి లో ఎంటెక్ చేశారు. కాంట్రాక్టు రంగంలో అంచెలంచెలుగా ఎదుగుతూ అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ పిలుపు మేరకు రాజకీయాలలో ప్రవేశించి 1985లో ఉదయగిరి నుండి ఎమ్మెల్యేగా గెలిచారు. సౌమ్యుడు వివాద రహితుడు తాను అభిమానించే వారి పట్ల విధేయత చూపే మంచి లక్షణాలు కలిగి ఉన్న మేకపాటికి రాజ్యసభ సీటు ఇచ్చి ఆయన సేవలను వైసీపీ వినియోగించుకోవాలని జిల్లాలోని ఆ పార్టీ కార్యకర్తలు జగన్మోహ రెడ్డి అభిమానులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తున్నారు.

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS... RNI REGISTRATION NUMBER... RNI : APTEL/2018/76380.... S.K. NAZEER. FOUNDER , EDITOR & PUBLISHER. SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD. SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA | Telugu News | Latest News Online | Political News in Telugu | Andhra Pradesh Latest News | AP Political News | Telangana News | Telangana Politics News | Crime News | Sports News |

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS... RNI REGISTRATION NUMBER... RNI : APTEL/2018/76380.... S.K. NAZEER. FOUNDER , EDITOR & PUBLISHER. SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD. SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA | Telugu News | Latest News Online | Political News in Telugu | Andhra Pradesh Latest News | AP Political News | Telangana News | Telangana Politics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!