పోలీసుల చేతికి చిక్కిన జల్సా దొంగలు
పోలీసుల చేతికి చిక్కిన జల్సా దొంగలు …
6.8 లక్షల నగదు స్వాధీనం.
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఏఎస్పి రాజేంద్ర
ఆళ్లగడ్డ, మే 17, (సీమకిరణం న్యూస్) :
జల్సాలకు అలవాటుపడి నేరాలకు పాల్పడే ముద్దాయిలను ఆళ్లగడ్డ పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి పట్టణంలోని డిఎస్పి కార్యాలయం వద్ద అడిషనల్ ఏఎస్పి రాజేంద్ర మీడియాతో మాట్లాడుతూ గత నెల 26వ తేదీన చాగలమర్రి మండలం పెద్ద బోధనం గ్రామానికి చెందిన వంగల వెంకటసుబ్బారెడ్డి ఆళ్లగడ్డ పట్టణంలోని యూనియన్ బ్యాంకులో 4,80,000 డబ్బులు తీసుకొని స్వగ్రామం పెద్ద భోదనంకు వస్తుండగా జాతీయ రహదారి 40 హైవే రోడ్డు నుండి సర్వీస్ రోడ్డు మీద చిన్న భోదనం పోయే ఒక్కిలేరు బ్రిడ్జి వద్దకు వచ్చేసరికి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మోటార్ బైక్ అడ్డంపెట్టి వెంకటసుబ్బారెడ్డిని ఆపి కత్తి చూపి అతని దగ్గర నుండి 4, 80,000 రూపాయలు తీసుకొని పారిపోయారు.ఈ విషయం చాగలమర్రి పోలీస్ స్టేషన్ నందు వెంకటసుబ్బారెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి అడిషనల్ ఏఎస్ పి రాజేంద్ర ప్రత్యేక టీమ్లను ఏర్పాటు చేశారు. రూరల్ సిఐ రాజశేఖర్ రెడ్డి, పట్టణ సీఐ కృష్ణయ్య దర్యాప్తును కొనసాగించారు. ఈ సందర్భంగా రాబడిన సమాచారం మేరకు సోమవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ముద్దాయిలు నంద్యాల జిల్లా నంద్యాల మండలం పెద్ద కొట్టాల గ్రామానికి చెందిన మండ్ల సురేంద్ర, నంద్యాల జిల్లా రుద్రవరం మండలం పెద్ద కంబలూరు గ్రామానికి చెందిన గువ్వల నరసింహుడు, ఈఇద్దరు ముద్దాయిలు పట్టణంలోని హైవే డాబా వద్ద అనుమానాస్పదంగా తిరుగుతుండగా రూరల్ సిఐ రాజశేఖర్రెడ్డి ,ఎస్ఐ నరసింహులు, పోలీస్ సిబ్బంది పట్టుకుని విచారించగా చిన్న భోధనం వద్ద జరిగిన 4,80,000 దారిదోపిడి మరియు ఆళ్లగడ్డ పట్టణంలోని పడకండ్ల బ్రిడ్జి వద్ద గత నెల 20వ తేదీన 2 లక్షలు దొంగతనం గూర్చి ఒప్పుకొనగ దొంగతనం చేసిన మొత్తం 6.80,000 వేల రూపాయలు, వారు ఉపయోగించిన యమహా మోటార్ సైకిల్, ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ముద్దాయిలను విచారించగా వారు జల్సాలకు అలవాటుపడి నేరం చేసినట్లు ఒప్పుకున్నారని కేసు నమోదు చేసినట్లు అడిషనల్ ఎస్పీ ఏ.రాజేంద్ర తెలిపారు .త్వరితగతిన కేసులను చేధించి ముద్దాయిల అరెస్టు చేసిన సీఐలను, ఎస్ఐని పోలీస్ సిబ్బందిని నంద్యాల జిల్లా ఎస్పీ అభినందించినట్లు అడిషనల్ ఎస్పీ ఏ రాజేంద్ర తెలిపారు .