చేత కాకుంటే తప్పుకోండి.. అభివృద్ధి చేసి చూపిస్తా
బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి
చేత కాకుంటే తప్పుకోండి అభివృద్ధి చేసి చూపిస్తా
నియోజకవర్గ నాయకులకు సవాల్ విసిరిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి
నందికొట్కూరు, మే 17, (సీమకిరణం న్యూస్) :
గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు నందికొట్టుకురు నియోజవర్గం ను అన్ని విధాల అభివృద్ధి చేసింది నేనే ఇప్పుడు ప్రస్తుతం నియోజకవర్గంను మూడు దయ్యాలు ప్రజలను పట్టిపీడిస్తున్నాయని నియోజకవర్గం ను ముగ్గురు కలసి ఇ నాశనం చేస్తున్నారని అభివృద్ధి చేయడం చేత కాకుంటే తప్పుకొని మాకు బాధ్యతలు ఇచ్చిందంటే నియోజకవర్గం ను అన్ని విధాల అభివృద్ధి చేసి చూపిస్తానని నందికొట్కూరు మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి ప్రస్తుత నాయకులకు సవాల్ విసిరారు. మంగళవారం పట్టణంలోని తన నివాసంలో మిడుతూరు మండలం దేవనూరు, చింతలపల్లి, అలగనూరు, ఉప్పల ద డీ య గ్రామాల వైసిపి నాయకులు 300 మంది లాయర్ మధు ఆధ్వర్యంలో బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో బిజెపిలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నందికొట్కూరు నియోజకవర్గంలో అన్ని గ్రామాలలో చిరస్థాయిగా ప్రజల గుండెల్లో గుర్తుపెట్టుకునే విధంగా గా పనులు చేసి బైరెడ్డి సత్తా ఏమిటో ఆ రోజుల్లోనే చూపించమన్నారు. నేను వేసిన రోడ్లపై ఇప్పుడు ఉన్న నాయకులు కనీసం ఒక మన్ను గంప కూడా వేయ లేదన్నారు. అలగనూరు లో మంచి రైతులను తయారుచేసింది బైరెడ్డి అన్నారు. గ్రామంలో మంచినీళ్లు, రోడ్లు ప్రజలు ఆర్థికంగా ఉండేవిధంగా ఆ రోజుల్లో అన్ని చర్యలు తీసుకున్నామన్నారు. ప్రస్తుతం గ్రామ, మండలాలలో అభివృద్ధికి నిధుల్లేక అభివృద్ధికి ఆమడ దూరంలో గ్రామాలు ఉన్నాయన్నారు కేంద్రం నుంచి వచ్చిన ఫండ్స్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరుగుతుందన్నారు. నంద్యాల వద్దు కర్నూలు జిల్లా కావాలని నేను ఆ రోజుల్లోనే ప్రజల మధ్యకు పొయ్యి చెప్పడం జరిగింది అని అయితే స్థానిక నాయకులు బైరెడ్డి కి పేరు వస్తుందని కనీసం ఆ రోజుల్లో టిడిపి, వైసిపి నాయకులు నోరు మెదపకపోవడం ఆంతర్యమేమిటని ఆ ముగ్గురి నాయకులను ప్రశ్నించారు. ఇప్పుడన్నా మేల్కోండి జాగ్రత్త రెండు సంవత్సరాలు ఉంటే ప్రజలు మీ సంగతి చెబుతారన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఎక్కడికి పోయిందని నీళ్లు ఎక్కడ పోశారు అన్నారు. పథకం వచ్చా అత్త పత్రాలు లేకుండా సీమ ఎత్తిపోతల పథకం అడ్రస్ లేదన్నారు. ఆ రోజుల్లో నందికొట్కూరు నుంచి మిడుతూరు మీదుగా ఓర్వకల్ వరకు రోడ్ వేయించి ఆర్టిసి బస్సు ను ప్రయాణికులకు చేయించడం జరిగిందని ప్రతి గ్రామంలో త్రాగునీరు, రోడ్లు, బ్రిడ్జిలు, హాస్పిటల్స్ ప్రతి గ్రామంలో వందల ఇల్లు కట్టించమని ఇప్పుడు నాయకులు నేను ఇచ్చిన స్థానాలకు వాకిళ్ళు పెట్టుకొని ఫోటోలు దిగి బిల్లులు తెచ్చుకోవడం జరిగిందన్నారు.
మూడు నెలల్లో రాష్ట్రంలో అనేక రాజకీయ నాయకులు జరుగుతాయని అప్పుడు నియోజకవర్గంలో ఆట మొదలవుతుందని బైరెడ్డి సత్తా ఏమిటనేది చూపిస్తాం అన్నారు. త్వరలో గతంలో ఉన్న కార్యకర్తలు అందరూ బైరెడ్డి వెంటే నడుస్తారని వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని వైసిపి పని అయిపోయిందని ఆ పార్టీ అడ్రస్ లేకుండా పోతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జి కొండే పోగు సుంకన్న, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షులు కరీం భాష, నాగన్న బైరెడ్డి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.