రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం
రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం…
ఆళ్లగడ్డ, మే 17, (సీమకిరణం న్యూస్) :
కేంద్రం, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యం అవుతుందని రాష్ట్ర మైనారిటీ కార్యదర్శి శంశుల్ హాక్ అన్నారు. విద్యుత్ బిల్లులు, బస్ చార్జీలు పెంచడాన్ని నిరసిస్తూ అలాగే పెట్రోల్, డీజల్, గ్యాస్ తో పాటు నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు శంశుల్ హాక్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. నాలుగు రోడ్ల కూడలి నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి తాహసిల్దార్ రమేష్ రెడ్డి కి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా శంషుల్ హాక్ మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందన్నారు. విద్యుత్, బస్సు చార్జీలు పెంచి ప్రజలపై భారం మోపిందన్నారు. ఇంధన ధరల తో పాటు నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్ని అంటయన్నారు. వైకాపా హయాంలో రైతన్నలు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేవన్నారు. ముస్లిం మహిళలకు దుల్హన్ పథకాన్ని అలాగే హిందూ సోదరీమణులకు పెళ్లి కానుక తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేక రోడ్డుపై పడ్డరన్నారు. రానున్న ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఆళ్లగడ్డ లో కూడా కాంగ్రెస్ జెండా ఎగర వేస్తామన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెంచిన ధరలను తగ్గించాలని అలాగే ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తాలూకా కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ గంధం మల్లేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఆళ్లగడ్డ మండల అధ్యక్షులు హుస్సేన్ భాష, సీనియర్ నాయకులు పుల్లయ్య,నాయకులు శ్రీనివాస యాదవ్, నరసింహుడు, వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.