టీడీపీ విస్తృతస్థాయి సమావేశానికి తరలిరండి

టీడీపీ విస్తృతస్థాయి సమావేశానికి తరలిరండి
పెద్దకడబూరు, మే 17, (సీమకిరణం న్యూస్) :
ఈనెల 19 న కర్నూలు నగరంలో జరుగు టిడిపి విస్తృతస్థాయి సమావేశానికి టిడిపి శ్రేణులు తరలి రావాలని టిడిపి రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం పెద్దకడబూరులోని రమాకాంతరెడ్డి స్వగృహం నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సమావేశానికి ప్రతి పక్ష, టిడిపి అధినేత నారా చంద్రబాబు హాజరవుతున్నట్లు తెలిపారు. కావున మండలంలోని ప్రతి గ్రామం నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు 40 వాహనాలలో పెద్ద ఎత్తున తరలివెళ్లాలని కోరారు. సమావేశం అనంతరం డోన్ నియోజకవర్గం ప్యాపిలి మండలం, జలదుర్గం గ్రామంలో నారా చంద్రబాబు నాయుడి ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమం జరుగుతుందని, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు బసలదొడ్డి ఈరన్న, టౌన్ అధ్యక్షులు మల్లికార్జున పాల్గొన్నారు.