
ప్రజానాట్య మండలి మహా సభను విజయవంతం చేయండి…
ఆళ్లగడ్డ, మే 17, (సీమకిరణం న్యూస్) :
ఆంధ్రప్రదేశ్ ప్రజా నాట్య మండలి రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని ప్రజా నాట్య మండలి అధ్యక్షులు వాసు, కార్యదర్శి పిలుపునిచ్చారు. స్థానిక ఎస్టియు కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ పురాతన కళ కు జీవనం పోయాలని, అంతరించిపోతున్న గ్రామీణ కళలను కాపాడు కోవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. యువత పెడదారి పెడుతూ వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారన్నారు. శాస్త్రీయ పరమైన కళను ప్రోత్సహించాలని గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి కళలను ప్రోత్సహించాలన్నారు. ఈనెల 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కడపలో జరిగే ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి పదవ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమానికి వాయిద్య, చెక్కభజన, కేటల, పౌరాణిక, జానపద కళాకారులుఅలాగే వివిధ రంగాలకు చెందిన కళాకారులందరు పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ తాలూక కార్యదర్శి భాస్కర్, ఎస్టియు నాయకులు హరి రెడ్డి ఇతరులు పాల్గొన్నారు.