నియోజకవర్గ అభివృద్ధి గంగుల కుటుంబంతోనే సాధ్యం
నియోజకవర్గ అభివృద్ధి గంగుల కుటుంబంతోనే సాధ్యం…
ఆళ్లగడ్డ, మే 17, (సీమకిరణం న్యూస్) :
గత టిడిపి ప్రభుత్వ హయాంలో మీరు మంత్రిగా ఉండి ఏమీ అభివృద్ధి చేశారో చెప్పాలని వైకాపా నాయకులు విమర్శించారు. మంగళవారం ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర రెడ్డి కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు గజ్జల రాఘవేంద్ర రెడ్డి, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కూలూరు నరసింహారెడ్డి, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ లు నాయబ్ రసూల్, మరియమ్మ, కౌన్సిలర్ గోట్లూరు సుధాకర్ రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమoలో ఎమ్మెల్యే గుడులు, దర్గా, చర్చిలు తిరిగి కార్యక్రమాన్ని మొక్కుబడిగా చేసి అనంతరం అందుబాటులో లేడని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆరోపణలు చేయడం అర్థరహితం అన్నారు. గడప గడపకు కార్యక్రమంలో భాగంగా గ్రామంలో రెండు రోజులపాటు శాసనసభ్యులు గంగుల నాని ఇంటింటికి తిరిగి ప్రతి కుటుంబానికి జరిగిన సంక్షేమం గురించి తెలియజేసి కరపత్రాలు అంద చేయడం జరిగిందన్నారు. గడప గడపకు చేసిన సంక్షేమం గురించి అందజేసిన కరపత్రాలు సకాలానికి రాకపోవడంతో గడప గడప కార్యక్రమానికి టెక్నికల్ గా సమస్య వచ్చిందన్నారు. అంతేకానీ మీరు చెప్పినట్లుగా మొక్కుబడిగా చేసి వెల్లలేదన్నారు. గడప గడపకు కార్యక్రమం అనేది ఒక్కరోజుతో పూర్తయ్యేది కాదన్నారు. వాస్తవాలు తెలుసుకుని మాజీ మంత్రి అఖిలప్రియ మాట్లాడాలన్నారు. నవరత్నాల ద్వారా ప్రతి కుటుంబానికి అమ్మఒడి, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన, పెన్షన్ తదితర సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూరుతుందన్నారు. జి జంబులదిన్నె గ్రామంలో 97% పూర్తిగా నవరత్నాలతో గడప గడపకు పార్టీలకతీతంగా సంక్షేమ కార్యక్రమాలు అందాయన్నారు. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ తెలుసుకొని మాట్లాడాలని ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడటం తగదన్నారు. ఆళ్లగడ్డ నియోజకవర్గ అభివృద్ధి గంగుల కుటుంబంతోనే సాధ్యమన్నారు. ఆళ్లగడ్డలో ప్రశాంత వాతావరణం ఉందన్నారు. ఆళ్లగడ్డ పట్టణంలో కూడా ప్రతి ఇంటికి శుద్ధ జలం ఇచ్చే కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారని, రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి స్వచ్ఛమైన తాగునీరు అందించడం జరుగుతుందన్నారు. కరోనా కష్టకాలంలో గంగుల కుటుంబం మొత్తం నియోజకవర్గంలో ఉండి ప్రజలకు సేవ చేసిన విషయాన్ని మీరు మర్చిపోయారా అని ప్రశ్నించారు. గంగుల కుటుంబం ఆళ్లగడ్డ నియోజకవర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేశారన్నారు. మీరు మంత్రిగా ఉన్న సమయంలో ఆళ్లగడ్డ నియోజకవర్గ అభివృద్ధికి ఏమి చేశారో అందరికీ తెలుసన్నారు. మీరు కూడా ప్రజలకు ఏదైనా అవసరం వచ్చే పని చేయాలని అంతేగాని అర్థం పర్థం లేని మాటలు మాట్లాడడం తగదన్నారు. అందుకే ప్రజలు మిమ్మల్ని మరచిపోయారన్నారు. ముఖ్యమంత్రి కర్నూలు పర్యటన ముగియగానే శాసనసభ్యులు గంగుల బ్రిజేంద్ర రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తారని వారు తెలిపారు. ఈ సమావేశంలో నరసింహులు తదితరులు పాల్గొన్నారు.