చిన్నపాటి వర్షానికి బురదమయమైన బస్ షెల్టర్
చిన్నపాటి వర్షానికి బురదమయమైన బస్ షెల్టర్
ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు
కొలిమిగుండ్ల, మే 17, (సీమకిరణం న్యూస్) :
మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్ షెల్టర్ ప్రాంగణం స్థలం లో వర్షపు నీరు నిలిచి బురదమయంగా మారి కంపు వెదజల్లుతుంది.వారంలో రెండు రోజులు మోస్తరు వర్షం కురవడంతోబురదమయమై అపరిశుభ్రంగా మారింది.దీంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.ప్రధాన రహదారి నుండి బస్ షెల్టర్ లోకి ప్రయాణికులు అడుగుపెట్టలేని దుస్థితి నెలకొంది.బస్ షెల్టర్ ప్రాంతమంతా కంకర గ్రావెల్ కూడినది కావడంతో ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాల రాకపోకలతో గుంతల మయంగా మారిన కంకర తేలి ఉన్నది. దీంతో కొద్దిపాటి వర్షం కురిసిన ప్రాంతమంతా వర్షపు నీరు నిలిచి బురదమయంగా మారుతున్నది.దీంతో ప్రయాణీకులు బస్ షెల్టర్ ప్రాంతంలోకి రాలేక ప్రధాన రహదారి పైనే బస్సులను ఎక్కి,దిగి రాకపోకలు సాగిస్తున్నారు. బస్ షెల్టర్ ఉన్న ప్రయాణికులకు ఉపయోగపడడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ప్రయాణికులు ప్రధాన రహదారిపై బస్సుల కోసం ఎదురు చూసే పరిస్థితి నెలకొంది. మూడు జిల్లాల సరిహద్దులో కొలిమిగుండ్ల ఉండడంతో తాడపత్రి, బనగానపల్లి, జమ్మలమడుగు, ఆళ్లగడ్డ, అనంతపురం తదితర పట్టణాలకు ఈ ప్రాంతం మీదుగా ప్రయాణికులతో వందలాది బస్సులు నిత్యం రాకపోకలు సాగిస్తున్నాయి. బస్ షెల్టర్ ప్రాంతంలోకి కొన్ని బస్సులు వచ్చి తిరిగి వెళుతున్న ప్రాంగణం లో నిలిపి ప్రయాణికులను ఎక్కించుకొని పరిస్థితి లేకపోవడంతోనే ప్రధాన రహదారిపై నిలిపి ఎక్కించుకుని ఉన్నారు.ఈ ప్రాంతమంతా అపరి పరిశుభ్రత నెలకొని కంపు వెదజల్లుతున్న పట్టించుకోని అధికారులు కరువయ్యారు.ఆర్టీసీ అధికారులు ఆదాయం పైనే కాకుండా ప్రయాణికుల సౌలభ్యలను కూడా చూడాలని ప్రజలు కోరుతున్నారు.బస్ షెల్టర్ ప్రాంతాన్ని సిమెంట్ తో నిర్మించి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా చూడాలని అలాగే ఇతర బస్సు డిపో లాగా బనగానపల్లె ఆర్టిసి బస్సు డిపో వారు కూడా బస్సులను ప్రధాన రహదారి పైన కాకుండా బస్ షెల్టర్ లోకి వచ్చేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.