టీజీ వెంకటేష్ జన్మ దినోత్సవంలో ఉచిత వైద్య శిబిరం

టీజీ వెంకటేష్ జన్మ దినోత్సవంలో ఉచిత వైద్య శిబిరం
ఆదోని , మే 17, (సీమకిరణం న్యూస్):
రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ జన్మదినోత్సవం సందర్భంగా స్వగ్రామము మండలంలోని పెద్ద తుంబలం గ్రామంలో రాయలసీమ ఆరోగ్య స్వచ్ఛంద సేవ సంస్థ ఆర్గనైజర్ సింహం,వీరన్న ఆధ్వర్యంలో మంగళవారం అమీలియా హాస్పిటల్ వైద్యుల సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వైద్య శిబిరన్ని గ్రామ సర్పంచ్ ఉచ్చప్ప,ఉపసర్పంచ్ తిక్కన్న ప్రారంభించారు.వైద్యులు లక్ష్మీ ప్రసాద్,వరప్రసాద్,యశోద చిన్నమ్మ లు కంటి పరీక్షలు, ఆరోగ్య సమస్యలు,మోకాళ్ళ నొప్పులు సమస్యలు చెవి, ముక్కు,గొంతు వంటి వాటిని పరీక్షించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఉచిత వైద్య శిబిరంలో దాదాపుగా 250 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించారు.కంటి పరీక్షలు చేయించుకునే వారికి బుధవారం కర్నూలుకు తీసుకువెళ్లేందుకు ఉచితంగా బస్ సౌకర్యం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఉచ్చప్ప మాట్లాడుతూ తమ గ్రామంలో ఉచితంగా వైద్య శిబిరం ఏర్పాటు చేయడం హర్షించదగ్గ విషయమన్నారు. ఇలాంటి అవకాశాలను గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కంటి చూపు సక్రమంగా కనిపించని వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయించి కంటి అద్దాలను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. గ్రామస్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు అంచెలంచెలుగా ఎదిగి ప్రజా సేవ కార్యక్రమాల్లో పాల్గొంటున్న టీజీ వెంకటేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గౌస్ అమీలియా హాస్పిటల్ సిబ్బంది గ్రామస్తులు రోగులు పాల్గొన్నారు.