POLITICS

పార్టీ పటిష్టతకు కృషి చేయాలి : – మాజీ మంత్రి భూమా అఖిలప్రియ

పార్టీ పటిష్టతకు కృషి చేయాలి

– మాజీ మంత్రి భూమా అఖిలప్రియ

చాగలమర్రి , మార్చి 10, (సీమకిరణం న్యూస్) :

గ్రామాలలో పాత, కొత్త అని తారతమ్యం లేకుండా తెలుగు దేశం పార్టీ ప్రతిష్టకు సమష్టిగా కృషి చేయాలని మాజీ మంత్రి, రాష్ట్ర టిడిపి ప్రధాన కార్యదర్శి భూమా అఖిలప్రియ పిలుపు నిచ్చారు. మండలంలోని పెద్ద వంగలి గ్రామంలో కార్యకర్తల చేరికకు గురువారం విచ్చేసిన భూమా అఖిలప్రియ, భార్గవ్ రామ్ లకు గజమాలతో స్వా గతం పలికి భారీ కార్యకర్తల ఆధ్వర్యంలో గిరి స్వామి దర్గా వద్దకు చేరుకొని ప్రత్యేక పా తే హాలు నిర్వహించారు. ఈ సంద ర్భంగా మాజీ మంత్రి మాట్లాడు తూ వైసిపి ప్రభుత్వం అభివృద్ధి చేయడంలో పూర్తి విఫల మైం దన్నారు. ముఖ్యమంత్రి జగన్ ఇమేజ్ తోనే ఎమ్మెల్యేలు గెలి చారూ తప్ప వారి కృషి ఏమీ లేదన్నారు. గెలిచిన ఎమ్మెల్యే లు జేబులు నింపుకుంటు న్నారు తప్ప గ్రామాల సమ స్యలు ఏనాడు పట్టించు కో లేద న్నారు. దీంతో విసుగు చెందిన కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ లోకి వలసలకు శ్రీకారం చుట్టా రన్నారు. రానున్న రోజుల్లో కార్యకర్తలందరూ తెలుగుదేశం పార్టీలోకి చేరబోతున్నారని వా రి సహకారంతో నియోజకవర్గం లో పార్టీకి పూర్వవైభవం తీసు కువస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండ ల టిడిపి కన్వీనర్ లాయర్ నర సింహారెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకులు నరసయ్య, పాల షరీఫ్, చాగలమర్రి మాజీ సర్పం చ్ ఆన్సర్ భాష, రాష్ట్ర తెలుగు నాడు ప్రధాన కార్యదర్శి నర సిం హుడు, ముళ్ళ షాబుల్, నాగరాజు, నాగరాజు యాదవ్, మాజీ సర్పంచ్ నర్సింహులు, దేవదుర్గం సూరీడు, పెద్ద సుబ్బ య్య, బాలమునయ్య, నరస య్య, వెంకటేశ్వర్లు,తదితరులు పాల్గొన్నారు.

తెలుగుదేశం పార్టీలో 20 కుటుంబాలు చేరిక

పోతినేని నాగేంద్ర, పోతినేని ప్రతాప్, తిని నరేష్, వెంకటే శ్వర్లు, ముళ్ళ మాలి భాష, మా భాష, ముల్ల గౌస్, చిన్న షరీఫ్, పెద్ద షరీఫ్, చాకలి గోవిందు, ముక్తియార్, మాపీరా, చాంద్ భాషా తదితరులు తెలుగుదేశం పార్టీలో చేరారు.

Related Articles

Back to top button
error: Content is protected !!