సాయినాథ్ శర్మపై దాడి చేయడం హేయమైన చర్య
సాయినాథ్ శర్మపై దాడి చేయడం హేయమైన చర్య
కర్నూలు టౌన్, మే 18, (సీమకిరణం న్యూస్) :
తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి,కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం ఇంచార్జి సాయినాథ్ శర్మ పై దాడి చేయడం హేయమైన చర్య అని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ అన్యాక్రాంత ఆస్తుల పరిరక్షణ కమిటీ చైర్మన్, ఏపీబ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య జిల్లా తెలుగుదేశం అధికార ప్రతినిధి సముద్రాలహనుమంతరావు అన్నారు. ఈ మేరకు బుధ వారం కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ బ్రాహ్మణ సంఘం నాయకులు అందరూ దాడిని ఖండించాలని కోరారు.
చంద్రబాబు పర్యటనలో
నేపథ్యంలో వైసీపీ నేతలు
బెదిరించడం పిరికిపంద
చర్యగా ఆయన పేర్కొన్నారు.
ఆయన నియోజకవర్గంలో మెజారిటీ ఎంపిటిసిలు తెలుగుదేశం గెలుచుకుందని కక్ష్య గట్టి
ఏదోవిధంగా భయపెట్టాలని అర్ధరాత్రి దొంగల్లో వచ్చి ఆస్తుల ను ధ్వంసం చేశారని ఆరోపించారు.ఒక బ్రాహ్మణుడి ఆస్తులు ధ్వంసం చేస్తే భయపడతారు అనుకోవడం అవివేకమని, రాష్ట్రంలో18 సంఘాలు
ఆయనకు అండగా ఉంటామని తెలిపారు.కడప జిల్లాలో పుణ్యభూమి చారిటబుల్ ట్రస్ట్ పేరుతో కొన్ని వందల మందికి నిత్యము అన్న దానం చేయు చున్న సాయినాథ్ శర్మ సంఘ టన జరిగిన దానికి యావత్తు బ్రాహ్మణీకం ఆయనకు మద్దతు గా నిలబడతామని పార్టీల కతీతంగా అన్ని పార్టీ నాయకులు మద్దతు ఇచ్చిన దానికి ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు.
ఎవరైనా బ్రాహ్మణులు జోలికి వచ్చినావాళ్ళ ఆస్తులు కబ్జా చేయడానికి ప్రయత్నించిన కించపరిచే విధంగా మాట్లాడిన ప్రతిబ్రాహ్మణుడు.యజ్ఞోపవీతం ధరించిన.ప్రతి ఒక్కరూ పరశురాముడు తెగింపు ధైర్యం తెచ్చుకుంటారని సముద్రాలు హెచ్చరించారు.