ఏఎస్ పేటలో ఉచిత మెగా వైద్య శిబిరం
ఏఎస్ పేట లో ఉచిత మెగా వైద్య శిబిరం
నెల్లూరు, ఆత్మకూరు, ఏఎస్ పేట, మే 21, (సీమకిరణం న్యూస్) :
దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డి జ్ఞాపకార్థం ఆత్మకూరు వైకాపా నాయకులు మున్సిపల్ వైస్ చైర్మన్ అభిరామ్ హాస్పిటల్స్ ఎండి డాక్టర్ కె శ్రావణ్ కుమార్ ఆత్మకూరు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారు అందులో భాగంగా శనివారం మండల కేంద్రమైన ఏఎస్ పేట లోని స్థానిక సచివాలయంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ వైద్య శిబిరాన్ని స్థానిక తాసిల్దార్ లక్ష్మీ నరసింహం, ఎంపీడీవో రజినీకాంత్, ఎస్ఐ షేక్ సుభాని, మండల వైకాపా కన్వీనర్ పందిళ్లపల్లి సుబ్బారెడ్డి, మండల కో ఆప్షన్ నెంబర్ సయ్యద్ భాష, ఏఎస్ పేట సర్పంచ్ భర్త షేక్ జిలాని భాష, లు ప్రారంభించారు అంతకుముందు మంత్రి మేకపాటి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి జ్యోతి ప్రజ్వలన చేశారు మండల ప్రజలు ఈ మెడికల్ క్యాంప్ లో పలురకాల వైద్య పరీక్షలు చేయించుకొని అవసరమైన మందులను తీసుకున్నారు అనంతరం డాక్టర్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ గౌతమ్ రెడ్డి జ్ఞాపకార్థం పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో నియోజకవర్గ పరిధిలోని అన్ని మండల కేంద్రాలలో ఈ ఉచిత మెగా వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐ పృథ్వీరాజ్ పంచాయతీ కార్యదర్శి నరసయ్య మండల వైకాపా నాయకులు రమేష్ రెడ్డి, అనుమసముద్రం సర్పంచ్ కుదారి హజరతమ్మ , మండల యూత్ ప్రెసిడెంట్ షేక్ షౌకత్ అలీ , పఠాన్ ఖాదర్ భాష, షేక్ వసీం, చల్ల హరికృష్ణ రెడ్డి,అభిరామ్ హాస్పిటల్ వైద్య సిబ్బంది స్థానిక ప్రభుత్వ వైద్యశాల వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.