యోగా అభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం
- రాష్ట్ర యోగా సంఘం చైర్మన్ లక్ష్మీకాంత్ రెడ్డి

యోగా అభివృద్ధికి సమిష్టిగా కృషి చేద్దాం
– రాష్ట్ర యోగా సంఘం చైర్మన్ లక్ష్మీకాంత్ రెడ్డి
కర్నూలు స్పోర్ట్స్, మే 26, (సీమ కిరణం న్యూస్) :
జిల్లాలో యోగ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేసి కలిసికట్టుగా ముందుకు వెళ్దామని రాష్ట్ర యోగా సంఘం చైర్మన్ దండు లక్ష్మీకాంత్ రెడ్డి అన్నారు. గురువారం స్థానిక డిఎస్ఏ అవుట్ చేయడంలోని యోగ హాల్ నందు యోగ అసోసియేషన్ ఆఫ్ కర్నూల్ డిస్టిక్
సర్వసభ్య సమావేశాన్ని జిల్లా సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు రవికుమార్ అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా రాష్ట్ర సంఘం చైర్మన్,జిల్లా సంఘం అధ్యక్షుడు డి.లక్ష్మీకాంత్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా అసోసియేషన్ ఆరు వసంతాలు పూర్తిచేసుకుని ఏడో వసంతంలో అడుగు పెట్టిన సందర్భంగా ఆగస్టులో కర్నూల్ వేదికగా 47వ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ మరియు జూనియర్ బాల బాలికల యోగాసన పోటీలను నిర్వహిస్తామన్నారు.అసోసియేషన్ ఏర్పాటు నుంచి నేటి వరకు కర్నూలు జిల్లా నుంచి 93 మంది క్రీడాకారులు జాతీయ స్థాయి పోటీలకు ప్రతినిధి వహించారని గుర్తుచేశారు. యోగ అభివృద్ధిలో జిల్లా సంఘం సభ్యుల సహకారం మరువలేనిదని అన్నారు. మీ అందరి సహకారంతో రాష్ట్ర అసోసియేషన్లో రెండు కీలక పదవుల్లో మనము ఉండడం మరింత ఆనందాన్ని ఇచ్చిందన్నారు.
జిల్లా సంఘంలో ఖాళీగా ఉన్న కొన్ని వివిధ రకాల పోస్టులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంఘం కార్యదర్శి అవినాష్ శెట్టి,జిల్లా ఒలంపిక్ సంఘం అడహక్ కమిటీ సభ్యులు పి.విజయ్ కుమార్,ప్రత్యేక ఆహ్వానితులుగా ఎం. వెంకటేశ్వర్లు,లక్ష్మయ్య,అసోసియేషన్ సభ్యులు హరి ప్రసాద్,ఈశ్వర్ నాయుడు, విజయకుమార్,ముని స్వామి, తదితరులు పాల్గొన్నారు.
నూతన సభ్యుల వివరాలు..
చీఫ్ పట్రాన్ గా డాక్టర్ నాగ ప్రకేశ్,రవికుమార్ (వర్కింగ్ ప్రెసిడెంట్), సీనియర్ వైస్ ప్రెసిడెంట్లుగా బ్రహ్మానంద రెడ్డి ,వెంకట హరి, జాయింట్ సెక్రటరీలు గా కళ్యాణి,మునిస్వామి,కార్యవర్గ సభ్యులుగా గంగాధర్, భీమన్న నాయుడు లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.