మూగజీవాలకు ఇంటిముంగిటే మెరుగైన వైద్యసేవలు
కర్నూలు నగర మేయర్ బి.వై. రామయ్య
మూగజీవాలకు ఇంటిముంగిటే మెరుగైన వైద్యసేవలు
కర్నూలు నగర మేయర్ బి.వై. రామయ్య
కర్నూలు టౌన్, మే 26, (సీమకిరణం న్యూస్) :
పశుపోషకుల ఇంటిముంగిటే మూగజీవాలకు మెరుగైన వైద్యసేవలు అందనున్నాయని కర్నూలు నగర మేయర్ బి.వై. రామయ్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.278 కోట్ల వ్యయంతో మొత్తం 340 పశువుల అంబులెన్స్‌లను సిద్దం చేస్తుండగా, తొలిదశలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇటివలే రూ.143 కోట్లతో సిద్ధం చేసిన 175 అంబులెన్స్‌లను ప్రారంభించిన సంగతి తెలిసిందే.అందులో కర్నూలు నియేజకవర్గానికైన మంజూరైన పశువుల అంబులెన్స్ ను గురువారం నగరంలోని బహుళార్థ పశు వైద్యశాల నందు కర్నూలు నగర మేయర్ బి.వై. రామయ్య , ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి రెండు చొప్పున 108 అంబులెన్స్ సేవల తరహాలోనే అత్యాధునిక సౌకర్యాలతో ఈ అంబులెన్స్‌లను తీసుకొచ్చిందన్నారు. వీటి నిర్వహణ ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుందని, అంబులెన్స్ సేవల కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ 1962 నెంబరును రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.ఫోన్ చేసి పశువు అనారోగ్య సమస్య వివరిస్తే చాలు, అంబులెన్స్‌లో రైతు ముంగిటకు వెళ్లి వైద్యసేవలందిస్తుందని అన్నారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ ఈ అంబులెన్స్ లో ఒక పశువైద్యుడు, వెటర్నరీ డిప్లొమా చేసిన సహాయకుడు, డ్రైవర్ కమ్ అటెండర్ ఉంటారని, 20 రకాల పేడ సంబంధిత పరీక్షలు, 15 రకాల రక్తపరీక్షలు చేసేందుకు మైక్రోస్కోప్‌తో కూడిన చిన్న ప్రయోగశాల ఉంటుందన్నారు. అన్ని రకాల వ్యాక్సిన్లు, మందులతోపాటు పశువును వాహనంలోకి ఎక్కించేందుకు హైడ్రాలిక్ సౌకర్యం ఉందని, ప్రాథమిక వైద్యసేవలతో పాటు సన్నజీవాలు, పెంపుడు జంతువులు, పక్షులకు సర్జరీలు చేసేందుకు, అవసరమైతే హైడ్రాలిక్ లిఫ్ట్ సౌకర్యంతో పశువును వాహనంలోకి ఎక్కించి శస్త్రచికిత్స చేసే సౌలభ్యం వాహనంలో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పశు సంవర్దక శాక జాయింట్ డైరెక్టర్ కె.రామచంద్రయ్య, డిడి హేమంత్ కుమార్, ఏడిలు వసంత లక్ష్మి, చంద్రలీల, చంద్రశేఖర్, సుభాన్ బాషా,డిడి రాజశేఖర్, రవిబాబు, దీప్తి విజయభాస్కర్ పాల్గొన్నారు.