వేలం పాటల్లో దేవాలయాల భూముల ఆదాయం రూ.4.96 కోట్లు
వేలం పాటల్లో దేవాలయాల భూముల ఆదాయం రూ 4. 96 కోట్లు
చాగలమర్రి, మే 25, (సీమకిరణం న్యూస్) :
నంద్యాల జిల్లా పరధిలోని 35 ఎకరాల దేవాలయాల భూముల వేలం పాటల్లో రూ 4. 96 కోట్లు ఆదాయం వచ్చినట్లు దేవాదాయ శాఖ కమీషనర్ సుధాకర్ రెడ్డి తెలిపారు. బుధవారం మండలంలోని మద్దూరు గ్రామంలో ఈశ్వరస్వామీకి 188/1 సర్వే నెంబర్ లో గల 1. 59 ఎకరాల వాణిజ్య భూమికి వేలం పాట నిర్వహించారు. ఈ వేలం పాట రాష్ట్ర దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమీషనర్ సాగర్‌బాబు పర్యవేక్షించారు. ఈ వేలం పాటల్లో తొమ్మిది మంది డిపాజిట్లు కట్టి పాల్గొనగా గుజరాత్ రామయ్య సంవత్సరానికి రూ 58 వేలకు దక్కించుకున్నారు.11 సంవత్సరాల పాటు ఈ భూమి పై హక్కు కల్గి ఉంటారని సంబంధిత అధికారులు తెలిపారు.కార్యక్రమం లో టెంపుల్ ఇన్స్‌పెక్టర్ రఘురాం,కార్య నిర్వహణ అధికారులు జనార్ధన్,సాయి జయ చంద్రారెడ్డి,సింగిల్ విండో అధ్యక్షులు దస్తగిరి,విఆర్‌ఓ ప్రసాద్ రెడ్డి,పంచాయితీ కార్యదర్శి రాజశేఖర్,జిఎమ్‌ఎస్‌కె క్రిష్ణ ప్రియ,దేవాదాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.