వైయస్సార్ స్మృతివనంలో పేట వైకాపా నేతలు
వైయస్సార్ స్మృతివనంలో పేట వైకాపా నేతలు
నెల్లూరు, ఆత్మకూరు, ఏఎస్ పేట, మే 22, (సీమకిరణం న్యూస్):
దివగంత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి జ్ఞాపకార్థం కర్నూలు జిల్లా ఆత్మకూర్ పట్టణ పరిధిలో నిర్మించిన స్మృతి వన కేంద్రాన్ని ఏఎస్ పేట మండల వైకాపా నాయకులు కార్యకర్తలు ఆదివారం సందర్శించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద తమకున్న అభిమానంతో స్మృతి వన కేంద్రాన్ని సందర్శించడం జరిగిందన్నారు. స్మృతి వనం కేంద్రాన్ని సందర్శించి అక్కడ ఏర్పాటు చేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అక్కడి ఆహ్లాదకర ప్రదేశాన్ని వీక్షించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించడం జరిగిందన్నారు. ఈ సందర్శన కార్యక్రమంలో ఏఎస్ పేట సర్పంచ్ భర్త షేక్ జిలాని భాష , మాజీ ఎంపిటిసి షేక్ షబ్బీర్ భాష , ఎండి రహమత్ ఆలీ,వైకాపా మైనార్టీ నాయకులు సయ్యద్ రషీద్ అహ్మద్, షేక్ రహ్మత్ నవాజ్, సయ్యద్ మునీమ్ బాషా, రషీద్, యువత సయ్యద్ షకీల్, షేక్ వసీం, పఠాన్ మొహిద్దిన్ తదితరులు పాల్గొన్నారు.