జర్నలిస్టులకు టోపీలు పంపిణీ
టోపీలు పంపిణీ చేసిన మన జర్నలిస్టుల సంక్షేమ సంఘం
జర్నలిస్టులకు టోపీలు పంపిణీ చేసిన మన జర్నలిస్టుల సంక్షేమ సంఘం
కర్నూలు టౌన్, మే 24, (సీమకిరణం న్యూస్):
కర్నూలు నగరంలో డి పి ఆర్ ఓ కార్యాలయం లో మన జర్నలిస్టుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు పి దస్తగిరి, అధ్యక్షులు భాస్కర్, ప్రధాన కార్యదర్శి టి.రాజశేఖర్ ఆధ్వర్యంలో పత్రిక, ఎలక్ట్రాన్ మీడియా విలేకరులకు టోపీలు పంపిణీ చేశారన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టులు ఎండా, వాన , లేకుండా ఎంతో కృషి చేస్తుంటారు. అలాంటి వారి కోసం కిమ్స్ హాస్పిటల్ సహకారంతో టోపీల కార్యక్రమం నిర్వహించామన్నారు. ప్రతి ఒక్కరూ ఈ టోపీలు ఉపయోగించుకొని వారి ఎండకాలంలో రక్షణ కోసం ఎంతో తోడ్పడుతుంది అన్నారు. ప్రతి ఒక జర్నలిస్టు తన ఆరోగ్యం బాగా చూసుకునే బాధ్యత ప్రతి విలేకర్లకు ఉందన్నారు కుటుంబం ఎంతో ఆధారపడి ఉంటుందని ఎండా వాన నుంచి రక్షణ కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఎంతో సంతోషకరమైన అన్నారు.
ఈ కార్యక్రమంలో పత్రిక విలేకరులు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు తదితరులు పాల్గొని విజయవంతం చేసేందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేశారు.