సామాజిక న్యాయ భేరి బస్సుయాత్ర విజయవంతం చేయండి
కర్నూలు ఎమ్యెల్యే హఫీజ్ ఖాన్
సామాజిక న్యాయ భేరి బస్సుయాత్ర విజయవంతం చేయండి
కర్నూలు ఎమ్యెల్యే హఫీజ్ ఖాన్
కర్నూలు టౌన్, మే 28, (సీమకిరణం న్యూస్):
సామాజిక న్యాయ భేరి బస్సుయాత్ర విజయవంతం చేయాలని కర్నూలు ఎమ్యెల్యే హఫీజ్ ఖాన్ తెలిపారు. శనివారం నగరంలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర నాలుగవ రోజు అంటే ఈ నెల 29 వ తేదీన మన కర్నూలు జిల్లాలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా మంత్రులకు స్వాగతం పలుకుతూ ఆహ్వానించే కార్యక్రమంలో కర్నూలు జిల్లాలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ అధిక సంఖ్యలో హాజరై, మన జిల్లా సత్తా ఏంటో నిరూపించాలని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. 29 వ తేదీన మంత్రుల బస్సు యాత్రకు మద్దతు పలికి యాత్రను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ లు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.