సామాజిక న్యాయభేరి బస్ యాత్రను జయప్రదం చేయండి
కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్ వి మోహన్ రెడ్డి

సామాజిక న్యాయభేరి బస్ యాత్రను జయప్రదం చేయండి
మాజీ ఎమ్మెల్యే ఎస్ వి మోహన్ రెడ్డి
కర్నూలు టౌన్, మే 28, (సీమకిరణం న్యూస్):
సామాజిక న్యాయభేరి బస్ యాత్రను జయప్రదం చేయాలని కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్ వి మోహన్ రెడ్డి తెలిపారు. స్థానిక బిఎయస్ ఫంక్షన్ హాల్ లో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కర్నూలు నగరానికి చెందిన 33 వార్డ్ ల వైస్సార్సీపీ ముఖ్య కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్బంగా మాజీ ఎమ్మెల్యే ఎస్ వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన వాగ్దానాలను పరిపూర్ణత తో అమలుచేసి ,అట్టడుగు వర్గాలవారికి ఉన్నత పదవులు ఇచ్చి వారి లో ఆత్మగౌరవాన్ని నింపి న గొప్ప వ్యక్తి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. 29 న మంత్రుల బస్ యాత్రను కార్యకర్తలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త తాను చేసిన కష్టానికి ప్రతిఫలం ఉంటుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రస్థాయి డైరెక్టర్లు, కార్పొరేటర్లు,మాజీ కార్పొరేటర్లు, మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్లు 33 వార్డ్ ల కు చెందిన ముఖ్య నాయకులు పాల్గొన్నారు.