ఉయ్యాలవాడ :
ఉపాధిహామీ పధకం లో భాగంగా సర్వయిపల్లె గ్రామం లో పూడిక తీత పనుల్లో ఉన్న చిన్న నరసింహుడు అనే వ్యక్తి శనివారం పాము కాటుకు గురైనట్టు ఏ పి ఓ రవి ప్రకాష్ తెలిపారు. ఇతన్ని చికిత్స కోసం వెంటనే ఆళ్లగడ్డ ప్రభుత్వ వైదశాలకు తరలించామన్నారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు వైద్యులు తెలిపారన్నారు.