WORLD

2022-23 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు వాకిన్ ఇంటర్వ్యూ

కేంద్రీయ విద్యాలయంలో 2022-23 విద్యా సంవత్సరానికి ప్రవేశాలకు వాకిన్ ఇంటర్వ్యూ

జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు.

కర్నూలు కలెక్టరేట్, మార్చి 10, (సీమకిరణం న్యూస్):-

ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కర్నూలు కేంద్రీయ విద్యాలయంలో 2022-23 అకడమిక్ విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు వాకిన్ ఇంటర్వ్యూ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ మరియు కేంద్రీయ విద్యాలయ నిర్వహణ కమిటీ చైర్మన్ శ్రీ పి. కోటేశ్వరరావు సూచించారు. గురువారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో కేంద్రీయ విద్యాలయంలో 2022-23 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి తదితర అంశాలపై కేంద్రీయ విద్యాలయ నిర్వహణ కమిటీ సభ్యులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు మాట్లాడుతూ 2022-23 అకడమిక్ విద్యా సంవత్సరానికి సంబంధించి ఉపాధ్యాయుల ప్యానెల్, ఒకటవ తరగతి మరియు ఆపై క్లాసులకు ప్రవేశాలకు వాకిన్ ఇంటర్వ్యూ నిర్వహించాలని కమిటీ సభ్యులను సూచించారు. కేంద్రీయ విద్యాలయ ఇన్ఛార్జి ప్రిన్సిపల్ ఆంజనేయులు, కమిటీ సభ్యులు పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, తరగతి గదుల మరమ్మతులు టాయిలెట్ల మరమ్మతులు, భవన గ్రౌండ్ ఫ్లోర్ పూర్తి పునరుద్ధరణ, ల్యాబ్‌లు మరియు కారిడార్‌ల టైలింగ్ మరమ్మతులు, వస్తువుల సేకరణ తదితర అంశాలపై తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ కు నివేదించారు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నిబంధనల ప్రకారం రాబోయే నూతన విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాలకు వాకిన్ ఇంటర్వ్యూతో పాటు కమిటీ సభ్యులు సూచించిన అజెండా అంశాలపై నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్లాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులైన పుల్లా రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి, పుల్లయ్య ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, డోన్ ఎస్బిఐ డిప్యూటీ మేనేజర్ నూర్ భాషా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ సాహిత్య, సిపిడబ్ల్యూడి ఎఈ మల్లికార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button
error: Content is protected !!