సామజిక న్యాయ భేరిని విజయవంతం చేద్దాం
కర్నూలు నగర మేయర్ బి.వై. రామయ్య
కల్లూరు : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సామజిక న్యాయ భేరిని విజయవంతం చేద్దామని కర్నూలు నగర మేయర్ బి.వై. రామయ్య పిలుపునిచ్చారు. శనివారం 19 వార్డులోని ఆయన క్యాంపు కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ దేశ చరిత్రలో మొట్టమొదటి ఎస్సీ, ఎస్టీ, బిసి మైనారిటీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఒక్కరే అని, బిసిలకు రాజకీయంగా, సామజికంగా అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు.దీన్ని ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీలు గ్రహించి, ఆదివారం సి.క్యాంప్ సెంటర్ నందు బస్సు యాత్రగా రానున్న 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మంత్రులకు నన్నూరు టోల్ ప్లాజా నుంచి సి.క్యాంపు సెంటర్ వరకు బైక్ ర్యాలీగా వచ్చి, అనంతరం జరగనున్న సభను విజయవంతం చేయాలని కోరారు.