కోనసీమ జిల్లా పేరు తొలగించి అంబేద్కర్ జిల్లాగా మార్చాలి
కోనసీమ జిల్లా పేరు తొలగించి అంబేద్కర్ జిల్లాగా మార్చాలి
మాజీ ఎమ్మెల్సి సుధాకరబాబు
కర్నూలు : కోనసీమ అనే పదం పూర్తిగా తొలగించి కేవలం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లాగా మార్చాలని మాజీ ఎమ్మెల్సీ ఎం సుధాకర బాబు అన్నారు. శనివారం కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకర్ల సమావేశంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా సుధాకర్ బాబు మాట్లాడుతూ కొందరు స్వార్థపరులు పదవులు అధికారం కోసం అంబేడ్కర్ పేరు వాడుకుంటున్నారని ప్రపంచ దేశాలు ఆదర్శంగా తీసుకున్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరు పెడితే తప్పేంటని రాష్ట్రంలో ఎన్నో జిల్లాలకు దేశ నాయకుల పేర్లు ప్రకటించారని అలాంటప్పుడు ఒక జిల్లాకు అంబేడ్కర్ పేరు పెడితే తప్పేంటని ప్రశ్నించారు దమ్ముంటే నాయకులు అంబేడ్కర్ ఫోటో లేకుండా ఎన్నికలకు వెళ్లగలరా అని ప్రశ్నించారు. అలాగే అమలాపురం సంఘటన ఒక పథకం ప్రకారమే జరిగిందని దళిత మంత్రి దళిత ఎమ్మెల్యేలకే రక్షణ లేకుంటే ఈ వైసిపి ప్రభుత్వంలో సామాన్యులకు రక్షణ ఎలా కల్పిస్తారని ఈ ప్రభుత్వంలో దళితులపై దాడులు అధికమయ్యాయని నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రధాని శ్రీమతి ఇందిరా గాంధీ కులమతాలకు అతీతంగా పాలన సాగించి దళితులకు అంటరానితనం నిర్మూలన లాంటి చట్టాలు వారి సంక్షేమానికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు నగర కాంగ్రెస్ అధ్యక్షులు జాన్ విల్సన్ పిసిసి అధికార ప్రతినిధి ఏ కరుణాకర్ బాబు ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు బి బతుకన్న కాంగ్రెస్ నాయకులు సత్యనారాయణ గుప్త యస్సీ సెల్ డబ్ల్యూ సత్యరాజు మొదలగు వారు పాల్గొన్నారు.