
రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు
– పది మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తే సామాజిక న్యాయం అవుతుందా…
– కాంగ్రెస్ నంద్యాల పార్లమెంట్ జిల్లా డిసిసి అధ్యక్షులు లక్ష్మి నరసింహ యాదవ్
నంద్యాల టౌన్, మే 28, (సీమకిరణం న్యూస్) :
రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ నియంతలా వ్యవహరిస్తున్నారని, పది మంది ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇస్తే సామాజిక న్యాయం అవుతుందా అని కాంగ్రెస్ నంద్యాల పార్లమెంట్ జిల్లా డిసిసి అధ్యక్షులు లక్ష్మి నరసింహ యాదవ్ ప్రశ్నించారు. నంద్యాల పార్లమెంట్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కాంగ్రేస్ పార్టీ సంస్థాగత ఎన్నికలు జరుపుట కోసం శిక్షణ కార్యక్రమం నిర్వహించటం గురించి ఏఐసీసీ ఏపిఅర్ఓ సంతోష్ కుమార్, డిఅర్ఓ భీమ్ భరత్ శనివారం నంద్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జంగిటి లక్ష్మీ నరసింహయాదవ్ అధ్యక్షతన ఏడు నియోజకవర్గాల కాంగ్రెస్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్బంగా ఏపీఆర్వో, ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి సంతోష్, జిల్లా ఎన్నికల అధికారి భీం భరత్, లక్ష్మి నర్సింహయాదవ్ లు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తను గుర్తుంచుకుంటుందని, వారికి తగిన న్యాయం చేస్తుందని, అభివృద్ధి ఫలాలు కాంగ్రెస్ పార్టీ అందించిన విధంగా ఏ పార్టీ అందించలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ యొక్క నియమ నిబంధనలకు లోబడి పార్టీ క్రమ శిక్షణకు కట్టుబడి పనిచేసే నాయకులకే పార్టీలో ప్రాధాన్యత ఉంటుందన్నారు. సామాజిక న్యాయం పేరుతో బస్సు యాత్ర బయలుదేరిందని,సామాజిక న్యాయం కంటే సామాజిక వినాశయాత్ర అని పేరు పెట్టుకుంటే బాగుంటుందన్నారు. రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్లన్నీ నిర్వీర్యమయ్యాయని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రములో పట్టణ అధ్యక్షులుచింతలయ్య, సమన్వయకర్త ఎస్ఎండీ ఫరూక్, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ మద్దిలేటిస్వామి, జిల్లా ఉపాధ్యక్షులు బాలస్వామి, జిల్లా కార్యదర్శి జనార్ధన్ యాదవ్, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు నాగ మదుయాదవ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతా మోహన్ రావు, రాష్ట్ర బీసీ సెల్ కన్వీనర్ రాంభూపాల్, జిల్లా ఉపాధ్యక్షులు గంధం మల్లేశ్వరరెడ్డి, కోశాధికారి ప్రసాద్, నంద్యాల, ఆళ్లగడ్డ బిబ్లాక్ అధ్యక్షుడు ఉసేన్, ఉయ్యాలవాడ అధ్యక్షులు వెంకటసుబ్బయ్య, శిరివెళ్ల అధ్యక్షులు లక్ష్మీ నరసింహా, ఇస్మాయిల్, ఫరూక్, అబ్దుల్లా రహిమాన్ తదితరులు పాల్గొన్నారు.