BREAKING NEWSSTATE

నీరు చెట్టు కింద చేపట్టిన పనులను త్వరితగతిన పరిశీలించండి

నీరు చెట్టు కింద చేపట్టిన పనులను త్వరితగతిన పరిశీలించండి

జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు.

కర్నూలు కలెక్టరేట్, మార్చి 10, (సీమకిరణం న్యూస్) :

జిల్లాలో నీరు చెట్టు కింద చేపట్టిన నూతన చెక్ డ్యాములు, వాగులు, వంకల పటిష్టత, నీటి కాలువల విస్తరణ తదితర నిర్మాణ పనులను త్వరితగతిన పరిశీలించి నివేదికలు అందజేయాలని జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు తనిఖీ బృందాలను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సునయన ఆడిటోరియంలో నీరు చెట్టు కింద చేపట్టిన నిర్మాణ పనుల పరిశీలన పై హౌసింగ్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ మరియు రైతు భరోసా) ఎస్. రామసుందర్ రెడ్డి, ఇరిగేషన్ ఎస్ ఈ రెడ్డి రాజశేఖర్ రెడ్డి, డిఆర్ఓ పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో నీరు చెట్టు కింద వివిధ రకాలైన దాదాపు 1600 పనులు జరిగాయని వీటిలో ఇప్పటి వరకూ 800 పనులకు సంబంధించి తనిఖీ నివేదికలు అందజేశారని మిగిలిన పనుల తనిఖీలను ముమ్మరం చేసి త్వరితగతిన నివేదికలను అందజేయాలని తనిఖీ బృందాల సభ్యులైన హౌసింగ్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లను ఆదేశించారు. తనిఖీ బృందాలకు అప్పగించిన పనులను రోజుకు 5 వర్క్ లు చొప్పున పరిశీలించి సూచించిన ప్రొఫార్మా లో నివేదికలు ఇవ్వాలన్నారు. చేపట్టిన పనులు, పనుల్లో నాణ్యత తదితర అంశాల్లో ఏవైనా అనుమానాలుంటే ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూ గైడ్ చేయాలని ఇరిగేషన్ ఎస్ ఈ రెడ్డి రాజశేఖర్ రెడ్డిని కలెక్టర్ ఆదేశించారు. చేపట్టిన పనుల నివేదిక ఆధారంగా అప్పగించిన పనులను ఇన్స్పెక్షన్ అథారిటీని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా పరిశీలించి వచ్చే నెల ఒకటో తేదీ లోగా పూర్తిచేయాలని కలెక్టర్ తనిఖీ బృందాలను ఆదేశించారు.

Related Articles

Back to top button
error: Content is protected !!