కెఎండి చూపు..టిడిపి విజయం వైపు
కెఎండి చూపు.. టిడిపి విజయం వైపు..
టిడిపి గెలుపే లక్ష్యంగా కెఎండి ఫారుక్ కృషి
జర్నలిస్టు, మైనార్టీ సంఘం నాయకుడిగా తనదైన ముద్ర
ఆపదలో ఉన్నవారికి ఆపద్బాంధవుడు
పదవులు ఆశించకుండా పార్టీ పటిష్టతకు కోసం కృషివలడైన ఫారుక్
ఎమ్మిగనూరు టౌన్, మే 29, (సీమకిరణం న్యూస్):
ఎన్నో విమర్శలు.. ఎన్నెన్నో అవమానాలు.. అయినా అవేవి లెక్క చెయ్యలేదు.. వెనుకడుగు వెయ్యలేదు.. ప్రజల పక్షాన నిలవాలనే సంకల్పం.. చేతనైనంత సహయం చేయాలనే ఆశయం ఆయనను రాజకీయం వైపు అడుగులు వేయించింది. ప్రపంచాన్ని గెలవాలంటే ప్రణాళిక ఉండాలి.. ప్రజల నాయకుడిగా ఎదగాలి అంటే నిత్యం ప్రజా క్షేత్రంలో ప్రజల తరుపున పోరాడాలీ..! అని నమ్మిన ఆయన టిడిపి పార్టీ లో ఏళ్ల తరబడి నాడు తండ్రి కీ. శే. బివి మోహన్ రెడ్డి అడుగు జాడల్లో నడిచి.. నేడు ఆయన తనయుడు టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ బి. వి జయనాగేశ్వర రెడ్డి కి తోడుగా ఉంటూ ఆయన అడుగు జాడల్లో టిడిపి బలోపేతానికి కృషి చేస్తున్న తీరు పట్టణ మైనార్టీ ప్రజల్లో మన్ననలు పొందుతున్నారు. పట్టుదలకు మరోరూపం ఆయన..నిజాయితీకి, నిబద్దతకు నిలువుటద్దం ఆయన.. అన్నా.. కష్టాల్లో ఉన్నామంటే చాలు అందరికంటే ముందుండే వ్యక్తి కూడా ఆయనే..చిరునవ్వే ఆయన ఆభరణం..మైనార్టీ ప్రజలు, జర్నలిస్టులే ఆయన ఆస్తి.. జర్నలిస్టుల ఆశయ సాధన కోసం, మైనార్టీ పేద కుటుంబాలకు అండగా ఉండి.. సంక్షేమం కోసం ఎంతటి కష్టాన్నైనా భరించి, ఎంతటి వారినైనా ఎదిరించే ధీరత్వం ఆయన సొంతం..సృష్టిలో ప్రేమ, దయ, కరుణ లాంటి విలక్షణమైన గుణాలున్న ఏకైక జీవి మనిషి. ఇతర జీవులతో పోలిస్తే- ఆపదలో ఉన్న సాటివారికి అపన్న హస్తం అందించే గొప్ప మనసు మనిషికి మాత్రమే ఉంటుంది. అందుకే ‘ప్రార్థించే పెదవులకన్నా, సహాయం చేసే చేతులు మిన్న’ అని ఈ సేవా గుణం ఆ నాటి కాలం నుంచి ఓ సినియర్ రాజకీయ నాయకుడి వెన్నంటే ఉండి నేర్చుకున్నాడనే చర్చ పార్టీ కార్యాలయంలో, జర్నలిస్టు సంఘాల నాయకులు జోరుగా చర్చ సాగుతోంది.. ఎపిజేఎఫ్ జర్నలిస్టు సంఘాల సభ్యుల్లో, మైనార్టీ ప్రజల గుండెల్లో చెరగని ముద్రవేసుకుని నీరాజనాలు అందుకుంటున్న… కె. ఎం. డి ఫారుక్ గురించి ప్రత్యేక కథనం.
టిడిపి గెలుపే లక్ష్యంగా.. కెఎండి ఫారుక్ కృషి
25 ఏళ్ళు అధికారంలో ఉన్న మాజీ మంత్రి దివంగత బివి ఇక్కడ నాయకులకు ఎం తో ప్రధాన్యత ఇచ్చారు. వారి వారి ఓటు బ్యాంకును బట్టి ఆయా నాయకులకు ఎక్కడ లేని అధికారాలు ఇచ్చారు. తాను స్థానికంగా లేనప్పుడు ఎక్కడ రాజకీయ కుట్రలు చేస్తారో? అని భయపడి రాజకీయం చేస్తూ వచ్చారు. నాయకులు ఒక్క సందర్భంలో ఏకమై ఒక వైపు ఉన్నా ప్రజలు మాజీ మంత్రి కీ. శే దివంగత బివికే పట్టం కట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి సినియర్ నాయకుడు వెన్నంటే ఉండి రాజకీయ ఓనమాలు నేర్చుకున్న వ్యక్తి ఫారుక్. నాడు సామాన్యుడుగా ఉంటూ నేడు ఓ రాజకీయ నాయకుడిగా ఎదిగాడు. అనాటి టిడిపి ప్రభుత్వ హయం నుండి బి. వి మరణంతరం వరకు తోడుగా ఉండి పార్టీ కోసం అహర్నిశలు కృషి చేశాడు. అయితే ఈయన ఏనాడు కూడ పదవులు ఆశించకుండా పార్టీ కోసం కృషి చేసిన ఘనత అయనకే దక్కుతుంది. అనాటి నుంచి మైనార్టీలకు నాయకత్వం వహిస్తూనే ఉన్నారు. ప్రస్తుతం టిడిపి పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు.
జర్నలిస్టు, మైనార్టీ సంఘం నాయకుడిగా తనదైన ముద్ర ..!
టిడిపి పార్టీనే కాకుండా స్వంతంగా ఓ పత్రికను కూడ ఏర్పాటు చేసి పత్రిక రంగంలో కొనసాగుతూ వచ్చారు. దీంతో జర్నలిస్టుల సమస్యలపై, హక్కుల సాధన కోసం ఓ యూనియన్ కూడ ఏర్పాటు చేసి జర్నలిస్టులకు అండగా నిలిచారు. అయితే అప్పట్లో జర్నలిస్టు అంటే ఎంతో గర్వం ఉండేది. ఏ జర్నలిస్టుకు సమస్య వచ్చినా కలసి కట్టుగా సమస్య పరిష్కారం కోసం కృషి చేసిన సందర్భాలు అనేకం. పేద కుటుంబాలైన జర్నలిస్టులకు అండగా ఉండి జర్నలిస్టులకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయించారు. జర్నలిస్టులకు ఏదైనా సమస్య వచ్చిందంటే ముందుగా నేనున్నాను అనే వ్యక్తి కె. ఎం. డి ఫారుక్. జర్నలిస్టులు ఆనారోగ్యంతో భాదపడుతున్నాడని విషయం తెలిసిందంటే నేరుగా వెద్యశాలకు వెళ్లి ఆర్థిక సహాయం అందించి.. జర్నలిస్టుకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. అంతే కాకుండా ప్రతి జర్నలిస్టు పెళ్లి కార్యక్రమంలో పాల్గొని వారికి పెళ్లి ఖర్చులు కూడ భరించి భరోసా ఇచ్చిన వ్యక్తి మన కెఎండి. ఫారుక్.
నాడు తండ్రి .. నేడు తనయుడి జాడలో..!
తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి బివి మోహన్ రెడ్డి ఆయన 1983 నుండి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. 1983-1999 వరకు ఆయన వరుసగా ఐదుసార్లు గెలుపొందారు.తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు, టిడిపి ప్రస్తుత అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు హయాంలో ఆయన మంత్రిగా పని విధులు నిర్వర్తించారు. గత ఉప ఎన్నికలలో బివి మోహన్ రెడ్డి ఎమ్మిగనూరు నుండి పోటీ చేసి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేతిలో ఓటమి చవి చూశారు. ఉప ఎన్నికల ప్రచారంలో ఉండగానే ఆయన ఆరోగ్యం విషమించి ఎన్నికల అనంతరం మృతి చెందారు. 1983 నుంచి మైనార్టీ పట్టణ అధ్యక్షులు కె. ఎం. డి ఫారుక్ టిడిపి పార్టీనే నమ్ముకొని పదవిని కొనసాగిస్తూ వచ్చారు. కీ. శే బివి మోహన్ రెడ్డి మరణం అనంతరం తనయుడు బివి జయనాగేశ్వర రెడ్డి ఎన్నికల బరిలో నిలిచారు. అయితే తండ్రిలా గుడ్డిగా ఎవరిని పడితే వారిని నమ్మకుండా.. ఎవరన్ని దగ్గరకు తీసుకోవాలో? ఎవరని దూరం పెట్టాలో మరింత బాగా తెలుసు. ఇది గమనించే నేతలందరూ తాము తోక జాడిస్తే కష్టమనే ఆయన వద్ద కిక్కురు మన కుండా కొనసాగు తున్నారు. ఇదంతా ఒక ఎత్తేతే తన తండ్రి బివి ఎన్నికల్లో ఇచ్చిన హామి ప్రకారం నత్త నడకన సాగుతున్న అండర్ గ్రౌండ్ పనులు, రోడ్లు వేయించి ప్రజలకు శాశ్వతంగా తాగునీటి సమస్య పరిష్కరించిన బివికి తిరుగులేదు అంటున్నారు పట్టణ ప్రజలు. నాడు తండ్రి చేసిన అభివృద్ధే.. తనయుడు బి. వి జయనాగేశ్వర రెడ్డి ప్రభుత్వ హయాంలో కూడ తండ్రి ఆశయ సాధనకు కృషి చేసిన అభివృద్ధి పట్ల పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే నాడు తండ్రికి నేడు బివి జయనాగేశ్వర రెడ్డి కి తోడుగా ఉంటూ అయన ఆడుగు జాడల్లో నడుస్తూ.. పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న కె. ఎం. డి ఫారుక్ తీరుపై మైనార్టీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.