నామినేషన్ దాఖలు చేసిన మేకపాటి. విక్రమ్ రెడ్డి
నెల్లూరు జిల్లా, ఆత్మకూరు, జూన్ 02, (సీమకిరణం న్యూస్):
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నికకు వైయస్ఆర్సీపీ తరుపున ఆత్మకూరు ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన మేకపాటి విక్రమ్ రెడ్డి. నామినేషన్ దాఖలుకు బల పరిచేందుకు ఆదాల ప్రభాకర్ రెడ్డి బాలినేని శ్రీనివాసులు హాజరయ్యారు.. నామినేషన్ దాఖలు చేసేందుకు తొలుత ఇంటి వద్ద ప్రత్యేక పూజలు చేసి తల్లిదండ్రులైన మేకపాటి రాజమోహన్ రెడ్డి దంపతుల ఆశీస్సులు అందుకని ఆత్మకూరు పట్టణానికి విచ్చేసిన విక్రమ్ రెడ్డి పట్టణంలోని ఆంజనేయ స్వామి గుడి, దర్గా, చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఆత్మకూరు ఆర్టీసీ డిపో నుండి ఆర్డిఓ కార్యాలయం వరకు నాయకులు కార్యకర్తలు అభిమానులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆత్మకూరు ఆర్డీవో కార్యాలయంలో 11: 20 నిమిషాలకు నామినేషన్ దాఖలు చేశారు. మేకపాటి విక్రమ్ రెడ్డి నామినేషన్ కు కార్యకర్తలు నేతలు భారీగా తరలివచ్చారు. ర్యాలీ లో మంత్రి కాకాని, ఎంపీ ఆదాల, పార్టీ అధ్యక్షుడు వేమిరెడ్డి లతో పాటు నామినేషన్ కార్యక్రమానికి మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాసులు, అనిల్ కుమార్ యాదవ్, కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి, కిలివేటీ సంజీవయ్య, కందుకూరు ఎమ్మెల్యే మహేందర్ రెడ్డి, విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి మాజీ పార్లమెంటు సభ్యులు రాజమోహన్‌రెడ్డి, హుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం,తదితరులు హాజరయ్యారు..