ANDHRABREAKING NEWSCRIMENEWS PAPERSTATEWORLD
నంద్యాలలో విజిలెన్స్ అధికారులు దాడులు
నంద్యాలలో విజిలెన్స్ అధికారులు దాడులు
నంద్యాల క్రైమ్, జూన్ 02, (సీమకిరణం న్యూస్) :
నంద్యాలలో విజిలెన్స్ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. నంద్యాలలోని ఆర్కె ఎంటర్ప్రైజెస్ నందు దాడులు నిర్వహించగా గత మార్చి నెలలోనే షాపు నిర్వహణకు సంబంధించి అనుమతులు ముగిసినట్లు విజిలెన్స్ సిఐ నాగరాజు పేర్కొన్నారు. అందులో నిల్వ ఉన్న గ్రోమోర్ యూరియా, ఇతర రసాయనిక ఎరువులను సీజ్ చేసినట్లు తెలిపారు.ఈ దాడుల్లో విజిలెన్స్ ఎస్ఐ జయన్నతో పాటు స్థానిక వ్యవసాయ శాఖ అధికారి అయూబ్ బాషా, మైనింగ్ అధికారి సిద్దయ్య తదితరులు దాడుల్లో పాల్గొన్నారు. విజిలెన్స్ దాడుల నేపథ్యంలో రసాయనిక, క్రిమి సంహారక దుకాణ యజమానులు బెంబేలెత్తిపోతున్నట్లు తెలుస్తుంది.