రైల్వే ట్రాక్ కొరకు భూముల పరిశీలన
బనగానపల్లె, జూన్ 02, (సీమకిరణం న్యూస్):
మండల పరిధిలోని యన్నకలలోని జయ జ్యోతి సిమెంట్ ఫ్యాక్టరీ నుండి బనగానపల్లె రైల్వే స్టేషన్ వరకు ఫ్యాక్టరీ వారు రైల్వే ట్రాక్ నిర్మించుటకు భూమి అవసరం కాగా డోన్ ఆర్డిఓ వెంకట్ రెడ్డి ఎమ్మార్వో ఆల్ఫ్రెడ్ సంబంధిత రైతులతో ఫ్యాక్టరీ యాజమాన్యం తో చర్చించడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన ధర నిర్ణయిస్తామని పేర్కొన్నారు. భూమి కోల్పోతున్న రైతుల సూచనలు పరిగణలోకి తీసుకుంటామన్నారు.