కామాక్షితాయి సేవలో వ్యాపారవేత్త ప్రసాద్ రెడ్డి

కామాక్షితాయి సేవలో వ్యాపారవేత్త ప్రసాద్ రెడ్డి
నెల్లూరు జిల్లా, బుచ్చిరెడ్డిపాలెం, జూన్ 03,(సీమకిరణం న్యూస్):
బుచ్చిరెడ్డి పాళెం మండలం జోన్నవాడ గ్రామంలో వెలసిన శ్రీ మల్లికార్జున సమేత కామాక్షితాయి అమ్మవారిని ప్రముఖ వ్యాపారవేత్త ప్రసాద్ రెడ్డి దంపతులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శుక్రవారం కావడంతో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు మహా నవావరణ పూజ,సహస్రనామార్చన పూజ గోపూజ, రుద్ర హోమం జరిపించారు.ఈ సందర్భంగా అమ్మవారి పూలలంకరణ, సుబ్రహ్మణ్యం స్వామి,విజ్ఞేశ్వర పూజా ,పెట్టు వస్త్రల సమర్పణ, గో పూజ , అమ్మవారి అభిషేకం ,అన్నదానం,తీర్ద ప్రసాదనాలు అందజేశారు.చైర్మన్ పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడు దంపతులు చేతులు మీదుగా ప్రసాదాలను అందించారు. అనంతరం బుచ్చి నగర చైర్ పర్సన్ మోర్ల సుప్రజ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.అనంతరం అర్చకులు ఆలయ సాంప్రదాయ ఆచారాలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారి కృపా కటాక్షలతో ఆశిర్వచనాలు అందజేసారు.ఈ ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ పుట్టా లక్షీకాంతమ్మ,ఆలయ ఈవో డబ్బుగుంట వెంకటేశ్వర్లు,ఉభయకర్తలు తిక్కవరపు శ్యామ్ ప్రసాదరెడ్డి,చిట్టమూరు వెంకటరెడ్డి దంపతులు మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు.