మహిళలకు దిశా యాప్ ఒక ఆయుధం
– ఏ. ఎసై విశ్వనాధ్
నెల్లూరు జిల్లా, బుచ్చిరెడ్డి పాలెం, జూన్ 03, (సీమకిరణం న్యూస్) :
బుచ్చిరెడ్డిపాళెం పట్టణంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దిశా యాప్ పై బుచ్చి నగర పోలీసులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. సిఐ చిట్టెం. కోటేశ్వరావ్ ఎస్ ఐ వీర ప్రతాప్ నేతృత్వంలో స్థానిక జొన్నవాడ రోడ్డులో ఏ ఎస్ ఐ విశ్వనాధ్ సచివాలయ సిబ్బంది మహిళా పోలీసులు ఆ ప్రాంత ప్రజలకులు వాహనాదరులకు దిశా యాప్ పై విస్తృత ప్రచారం గావించారు. ప్రజల సెల్ ఫోన్లలో దిశా యాప్ డౌన్లోడ్ చేయిస్తూ దిశా యాప్ ప్రాధాన్యతను వివరిస్తున్నారు. ఆపదలో ఉన్న ప్రతి వ్యక్తి కి తోడుగా ఉంటుందని వారు తెలియజేసారు. క్షణాల్లో మాన ప్రాణ రక్షణకు భరోసా దిశా యాప్ అని క్షేత్రస్థాయిలో పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ మొబైల్ ఫోన్లలో తప్పనిసరిగా ఈ యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని వారు తెలిపారు. ఎటువంటి ఆపద సమయంలోనైనా సరే దిశా యాప్ ద్వారా తమకు సమాచారం అందిస్తే క్షణాల్లో అక్కడ ఉంటామని వారు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోలీసు వ్యవస్థ దీనిని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని వారు తెలిపారు.