ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSTATE

ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా : విక్రమ్ రెడ్డి

ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా : విక్రమ్ రెడ్డి

నెల్లూరు, ఆత్మకూర్, ఏఎస్ పేట, జూన్ 03, (సీమకిరణం న్యూస్) :

ఆత్మకూరు నియోజకవర్గానికి జరుగనున్న ఉప ఎన్నికల్లో వైసిపి అభ్యర్థిగా పోటీలో ఉన్న తనను భారీ మెజార్టీతో గెలిపించి ఆశీర్వదిస్తే నియోజకవర్గానికి అన్ని విధాల అభివృద్ధి చేస్తానని వైసిపి అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు ఆయన శుక్రవారం ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఏఎస్ పేట మండలంలోని జమ్మవరం, కాకర్ల పాడు, గుంపర్లపాడు, కావలి ఎడవల్లి, వేల్పుల గుంట, హసనాపురం, చిరమన, శ్రీ కొలను, తదితర గ్రామాలలో ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో ప్రజలు అన్న మేకపాటి గౌతం రెడ్డి ను ఆదరించినట్లు తనను ఆదరించి గెలిపించాలని తను కూడా అన్న బాటలో పయనిస్తూ ఏఎస్ పేట మండలంలోని అన్ని గ్రామాలను అభివృద్ధి పథంలో తీసుకు వెళ్తామన్నారు అలాగే ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరిస్తూ ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందిస్తామన్నారు ఈ సందర్భంగా ఆయన ఇంటింటా వెళ్లి ప్రతి ఒక్కరికి ఉప ఎన్నికల్లో ఆశీర్వదించాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి, మండల వైకాపా కన్వీనర్, పందిళ్ళపల్లి సుబ్బారెడ్డి, ఎంపీపీ పద్మజా రెడ్డి, రాజవోలు సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యుడు సయ్యద్ సంధాని భాష , ఏఎస్ పేట సర్పంచ్ భర్త షేక్ జిలాని భాష, మాజీ ఎంపీటీసీ షేక్ షబ్బీర్ భాష , నంది వివేకానంద రెడ్డి, వైసిపి నాయకులు రమేష్ రెడ్డి , కల్లూరు ప్రభాకర్ రెడ్డి, పులిమీ సుధాకర్ రెడ్డి, అమ్మవరం కోటిరెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, అనుమసముద్రం ఉప సర్పంచ్ షేక్ శేరజ్ ,సయ్యద్ అబ్దుల్ రషీద్, షేక్ రహమత్ నవాజ్, షేక్ వసీం, సయ్యద్ షకీల్, మండల యూత్ ప్రెసిడెంట్ షేక్ షౌకత్ అలీ, మండలంలోని నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS... RNI REGISTRATION NUMBER... RNI : APTEL/2018/76380.... S.K. NAZEER. FOUNDER , EDITOR & PUBLISHER. SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD. SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA | Telugu News | Latest News Online | Political News in Telugu | Andhra Pradesh Latest News | AP Political News | Telangana News | Telangana Politics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!