ప్యాపిలి మండలంలో గాలివాన బీభత్సం

ప్యాపిలి మండలంలో గాలివాన బీభత్సం
ప్యాపిలి, జున్ 03, (సీమకిరణం న్యూస్) :
ప్యాపిలి మండల పరిధిలోని మెట్టుపల్లె, చిగారమను, జక్కసానిగుంట్ల, నల్లమేకలపల్లి, ఊట కొండ గ్రామంలో గురువారం గాలివాన బీభత్సం సృష్టించింది. గాలివాన దెబ్బకు అరటి, బొప్పాయి తోటలు అతలాకుతలమయ్యాయి.భారీగా వీచిన ఈదురుగాలులకు గ్రామంలోని పలురైతులకు చెందిన అరటి, బొప్పాయి తోటలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.రైతు నాగభూషణం రెడ్డి మాట్లాడుతూ పంట చేతికి వచ్చే సమయానికి గాలివాన బీభత్సానికి 12 ఎకరాల్లో అరటి చెట్లు నేలకూలాయని, ఫలితంగా 30 లక్షల వరకు నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశాడు.గ్రామానికి చెందిన పలు రైతులతోటలు పూర్తిగా ద్వంసం అయినట్లు, గ్రామ వ్యాప్తంగా 2కోట్ల 24లక్షలు నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేశారు.ప్రభుత్వం తమను ఆదుకోకపోతే అప్పులపాలు అవుతామని, ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.